హైదరాబాద్ : అఖిల్ అక్కినేని చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం లెనిన్. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతానికి పైగా పూర్తయింది. తాజాగా సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రాణం పెట్టి సంగీతాన్ని అందించాడు ఎస్ఎస్ థమన్. దీనిని పూర్తిగా మధురమైన మెలోడీగా తీర్చిదిద్దాడు. ఎవరూ ఊహించని రీతిలో భిన్నమైన పాత్రలో కనిపించాడు అఖిల్ అక్కినేని. వారే వా వారే వా పేరుతో పాటను రూపొందించారు. దర్శకుడి ప్రతిభ ఇందులో కనిపిస్తుంది. సోమవారం అధికారికంగా మూవీ మేకర్స్ రొమాంటిక్ ట్రాక్ తో కూడిన సాంగ్ ను రిలీజ్ చేశారు.
విడుదలైన కొద్ది సేపటికే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. పిక్చరైజేషన్ అద్భుతంగా ఉంది. పాటకు తగ్గట్టు హీరో, హీరోయిన్లు ప్రకటించిన హావభావాలు మరింత హత్తుకునేలా ఉన్నాయి. ఇది ఇప్పటికే సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. శ్వేతా మోహన్ , జుబిన్ నౌటియల్ అందంగా ఆలపించిన ఈ పాట, దాని హృద్యమైన గాత్రం , భావోద్వేగ లోతుతో ప్రత్యేకంగా నిలుస్తుంది. గీత రచయిత అనంత శ్రీరామ్ తన కవితాత్మక నైపుణ్యాన్ని జోడించాడు. పాటకు సంబంధించి రొమాంటిక్ ఆకర్షణను మరింత పెంచారు. ఈ పాటతో లెనిన్ సినిమాపై అంచనాలు మరింత పెంచేలా చేశాడు దర్శకుడు.
ఇదిలా ఉండగా ఈ వేసవిలో థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది ఈ మూవీ. ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి , సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని , భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
The post అఖిల్ లెనిన్ ఫస్ట్ సింగిల్ కెవ్వు కేక appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
