అగ్రరాజ్యంపై చైనా మండిపాటు
బీజింగ్: సుంకాల విధింపులో అమెరికా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని చైనా వాణిజ్య శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చర్యలు తమ ప్రయోజనాలకు తీవ్ర హానికరమని మండిపడింది. తాము సాధారణంగా ఇతరులతో ఘర్షణకు దిగబోమని, అదే సమయంలో అవసరమైతే పోరాటానికి వెనుకాడేది లేదని పేర్కొంది. చర్యకు ప్రతిచర్య తప్పదని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా తీసుకుంటున్న చర్యలు ఇరు దేశాల వాణిజ్య, ఆర్థిక చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. చైనా వస్తువులపై వచ్చే నెల 1 నుంచి అదనంగా 100 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
