Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

కాంగ్రెస్‌ పాలనలో అన్నీ బంద్‌

Ai generated article, credit to orginal website, October 13, 2025

పథకాలు, సంక్షేమం బంద్‌జేసిన సీఎం రేవంత్‌
వైద్యశాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 8 నెలలుగా వేతనాలు రావడం లేదు
కేసీఆర్‌ కిట్‌, న్యూట్రీషన్‌ కిట్‌ బంద్‌ అయ్యాయి
మహిళలకు ఫ్రీ బస్‌ పెట్టి, మగవాళ్లకు డబుల్‌ చార్జి వసూలు చేస్తున్నరు..
వెంటనే మకలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కేసీఆర్‌ కావాలి.. మళ్లీ రావాలని ప్రజలంతా కోరుతున్నారు..
సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, అక్టోబర్‌ 12 : కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అన్నీ ఎగవేతలు, పథకాలు బంద్‌ నడుస్తున్నదని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్‌ కావాలి.. రావాలి అని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 297 మందికి ఆదివారం సీఎం సహాయనిధి చెకులను అందచేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12 వేల మందికి రూ.40 కోట్ల మేరు సీఎంఆర్‌ఎఫ్‌ సహాయం అందించినట్లు తెలిపారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నదని, ప్రభుత్వ దవాఖానలు ఆధ్వానంగా తయారైనట్లు చెప్పారు. కేసీఆర్‌ కిట్టు, న్యూట్రీషన్‌ కిట్టు కాంగ్రెస్‌ ప్రభుత్వం బంద్‌ చేసిందని, ప్రభుత్వ దవాఖానల్లో మందులు లేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటి వరకు మకల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు.ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 8 నెలల నుంచి వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాళ్లకు వేతనాలు ఇచ్చే స్థితిలో లేని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకేమి సేవలు చేస్తుందని విమర్శించారు.
ఉచిత బస్‌ అని పెట్టి భార్యలకు ఫ్రీ అని, భర్తలకు డబుల్‌ టికెట్‌ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. మనకు మళ్లీ మంచి రోజులు వస్తాయన్నారు. కచ్చితంగా వచ్చేది కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నారు. కార్యక్రమం లో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కనకరాజు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల సాయిరాం, సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ పై ఫోక‌స్ పెట్టాలి
  • రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ డ్రామా
  • స‌చిన్ టెండుల్క‌ర్ కు చెప్పే జ‌ట్టులోంచి తొల‌గించాం
  • సంజు శాంస‌న్ వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ : గౌత‌మ్ గంభీర్
  • రొయ్య‌ల రైతుల ఆవేద‌న స‌ర్కార్ ఆలంబ‌న‌

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes