SERP: స్వయం సహాయక సంఘాలలో పుస్తక నిర్వహణ, శిక్షణలో గ్రామ స్థాయిలో పని చేస్తున్న గ్రామ సంఘ సహాయకులు (Village Organisation Assistants) గత ప్రభుత్వంలో విధించిన మూడు సంవత్సరాల కాల పరిమితిని కొనసాగించడానికి చెందిన విజ్ఞప్తిని SERP సానుకూలంగా పరిశీలించింది. ఈ రోజు SERP కార్యదర్శి, ముఖ్య కార్య నిర్వహణాధికారి ఆ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల జారీ చేసిన ఉత్తర్వుల ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
Cough syrup: దగ్గుమందు మరణాలు.. తమిళనాడు సహకరించడం లేదన్న మధ్యప్రదేశ్ సీఎం..
ఇందులో మొదటగా గ్రామ సంఘ సహాయకుల మూడేళ్ల కాల పరిమితిని కొనసాగించవలసిందని స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే గ్రామ సంఘాల సహాయకుల ఎంపిక లేదా తొలగింపు గ్రామ సంఘాల నిర్ణయం ప్రకారం జరుగుతుంది. సహాయకులు మారినప్పుడు, సంబంధిత గ్రామ సంఘ తీర్మానాలను మండల సమాఖ్య సహాయ ప్రాజెక్ట్ మేనేజర్ ద్వారా పధక సంచాలకులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు పంపాలి. అందులోని వివరాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అంతేకాకుండా గ్రామ సంఘాల సహాయకుల ద్వారా సంఘ నిధుల దుర్వినియోగం, అవినీతి జరిగితే, చట్టపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి పధక సంచాలకులు, DRDA అధికారులకు అధికారమును ఈ ఉత్తర్వుల ద్వారా కల్పించారు.
ఈ రోజు సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, SERP ముఖ్య కార్య నిర్వహణాధికారి వాకాటి కరుణ్ వి.ఓ.ఏ సహాయకుల ప్రతి నిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ ఉత్తర్వులు అందజేయడం జరిగింది. రాష్ట్రంలో 27,000 మంది గ్రామ సంఘ సహాయకులు మూడు సంవత్సరాలు పైబడి పని చేసినప్పటికీ, వారి పని తీరు సంతృప్తికరంగా ఉన్నట్లయితే, గ్రామ సంఘాల నిర్ణయం ప్రకారం వారి సేవ కొనసాగవచ్చని తెలిపారు.
KTR : హైకోర్టు స్టే పై కేటీఆర్ రియాక్షన్.. ఏమన్నారంటే..?
గ్రామీణ ప్రాంతాల్లోని సహాయకులు వివిధ డేటా అప్డేట్ కోసం కొత్త మొబైల్ ఫోన్లను ఇవ్వడంకు కోరిన ప్రతిస్పందనగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ SERP ముఖ్య కార్య నిర్వహణాధికారికి వీటిని అందించడానికి పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, గత కొంతకాలంగా వి.ఓ.ఏ సంఘాల నుండి వచ్చిన విజ్ఞప్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చినప్పటి నుండి, మూడు సంవత్సరాల కాల పరిమితి ఉత్తర్వులను నిలుపుదల చేయడం జరిగిందని వెల్లడించారు.
