Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

జీహెచ్‌ఎంసీ విభజన విఫల ప్రయోగమే!

Ai generated article, credit to orginal website, February 13, 2026

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌-జీహెచ్‌ఎంసీని మూడు భాగాలుగా విభజించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను administrative efficiency గా ప్రభుత్వం చెప్తున్నది. Better service delivery, manageable size, closer administration వంటి పదాలు వినడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఆ పదజాలం వెనుక ఉన్న ఆలోచనను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇది నగర స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే, సంస్థలను బలోపేతం చేయకుండా బలహీనపరచే దిశలో అడుగు వేయడమే అని స్పష్టమవుతున్నది.
జవహర్‌లాల్‌ నెహ్రూ అన్నట్టు Democracy is not merely a form of government; it is a way of life. నగరాల్లో చెత్త తొలగింపులో, కాలువల నిర్వహణలో, తాగునీటి సరఫరాలో, రహదారి భద్రతలో ఈ way of life ప్రతిరోజూ కనపడుతున్నది. నగరాన్ని పాలించే సంస్థ బలహీనమైతే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. నగరం అంటే మ్యాప్‌ కాదు.. పరస్పర ఆధారిత జీవవ్యవస్థ. నగరాన్ని కేవలం గవర్నమెంట్‌ ఆర్డర్‌తో మార్చే మ్యాప్‌గా చూడడం మౌలిక పొరపాటు. ఉపాధి కేంద్రాలు, నివాస ప్రాంతాలు, రవాణా మార్గాలు, నీటి సరఫరా, డ్రైనేజీ, చెత్త నిర్వహణ, పర్యావరణ ప్రవాహాలు పరస్పరం ముడిపడిన సమగ్ర జీవవ్యవస్థే నగరం.
జేన్‌ జేకబ్స్‌ నగరాలను problems in organized complexity అని అభివర్ణించారు. సంక్లిష్టత ఉన్నచోట విభజన కాదు, సమగ్రత అవసరం. When internal unity is lost, governance collapses into disorder. అని ప్లేటో హెచ్చరించాడు. నగర అధికారాన్ని విభజించడం అంటే ఆ అంతర్గత ఏకత్వాన్ని దెబ్బతీయడమే. 74వ రాజ్యాంగ సవరణతో మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు convenience of the Stateగా కాకుండా institutions of self-governmentగా గుర్తింపు పొందాయి. 12వ షెడ్యూల్‌లో పట్టణ ప్రణాళిక, భూవినియోగ నియంత్రణ, తాగునీరు, పారిశుధ్యం, ప్రజారోగ్యం, మురికి వాడల అభివృద్ధి వంటి కీలక బాధ్యతలు వీటికి అప్పగించారు. ప్రజాస్వామ్యాన్ని గ్రామాలు, పట్టణాలకు తీసుకెళ్లడమే 73వ, 74వ సవరణల ఉద్దేశం. ఇదే విషయాన్ని కిషన్‌సింగ్‌ తోమర్‌ వర్సెస్‌ అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (2006) కేసులో సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. మున్సిపాలిటీలు రాజ్యాంగబద్ధ సంస్థలేనని ధ్రువీకరించింది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పోలిక అసంబద్ధం
జిల్లాలను విభజిస్తే ఒప్పు.. నగరాలు విభజిస్తే తప్పా? అని కాంగ్రెస్‌ వర్గాల నుంచి ఓ వాదన వినిపిస్తున్నది. ఈ వాదన రాజ్యాంగపరంగా పూర్తిగా తప్పు. జిల్లా అనేది రాష్ట్ర పరిపాలనా విభాగం. జిల్లా కలెక్టర్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి. జిల్లాకు రాజ్యాంగంలో స్వయం పాలనా హోదా లేదు. కానీ గ్రామ పంచాయతీలు (Part IX), మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు (Part IX-A) రాజ్యాంగబద్ధ స్వయం పాలనా ప్రభుత్వాలు. వీటి ఎన్నికలు, పదవీకాలం, అధికారాలు రాజ్యాంగ రక్షణలో ఉన్నాయి. నగరాల గురించి అరిస్టాటిల్‌ చెప్పినట్టు The city is not a mere aggregation of individ uals, but an association aimed at the highest good. నగరాన్ని జిల్లాతో పోల్చడం అంటే నగర స్వరూపాన్నే తగ్గించి చూడటం.
ఇషర్‌జడ్జ్‌ అహ్లూవాలియా కమిటీ హెచ్చరిక
2011లో వచ్చిన ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ నివేదిక ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పింది: The weakness of India’s cities lies not in their size, but in the inadequacy of their governance structures and finances. అని పేర్కొన్నది. నగర సమస్య పరిమాణంలో కాదు పాలనా నిర్మాణంలో ఉన్నది. విభజనతో పన్నుల ఆధారం తగ్గుతుంది, వృత్తిపరమైన నైపుణ్యం తగ్గుతుంది, అప్పు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది, రాష్ట్రంపై ఆధారపడే పరిస్థితి పెరుగుతుంది. అలెక్సిస్‌ డి టోక్విల్లే అన్నట్టు Local institutions are to liberty what primary schools are to science. ఇలాంటి స్థానిక సంస్థల పై నిర్ణయం తీసుకునేప్పుడు ఎంతో తర్కంతో కూడిన జాగ్రత్త అవసరమని తత్వవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ ప్రయోగం: విభజన- వైఫల్యం-ఏకీకరణ
2012లో ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఉత్తర, దక్షిణ, తూర్పు భాగాలుగా విభజించారు. విభజన అనంతరం దక్షిణ ఢిల్లీకి అధిక ఆదాయ ప్రాంతాలు దక్కా యి. ఉత్తర, తూర్పు ఢిల్లీకి తక్కువ ఆదాయ ప్రాంతాలు దక్కాయి. ఇషర్‌ జడ్జ్‌ అహ్లూవాలియా కమిటీ Multiple agencies with overlapping responsibilities have led to weak accountability and poor service outcomes in metropolitan governance. అని చెప్పింది. ఢిల్లీ విషయంలో ఇది నిజమైంది. విభజన ఫలితంగా ఢిల్లీ కార్పొరేషన్‌ సేవలు పతనమయ్యాయి. మ్యాక్స్‌ వెబర్‌ అన్నట్టుగా Bureaucracy without clarity of authority degenerates into dysfunction. ఈ మాట ఢిల్లీ విషయంలో అతికినట్టు సరిపోయింది. ఆర్థిక అస్థిరత, సమన్వయ లోపం మొదలగు విషయాల కారణంగా 2022లో ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను మళ్లీ ఏకం చేశారు.
మెట్రోపాలిటన్‌ పాలన
రాజ్యాంగం ఆర్టికల్‌ 243 క్లాజ్‌ ప్రకారం మెట్రోపాలిటన్‌ ప్లానింగ్‌ కమిటీల అవసరాన్ని రాజ్యాంగమే గుర్తించింది. నగర సమస్యలు సమగ్ర ప్రణాళికతోనే పరిష్కారమవుతాయి. విభజనతో సమన్వయం తగ్గుతుంది, పోటీ పెరుగుతుంది. బాధ్యతలు ఒకరిపై ఒకరు నెట్టివేయడం మొదలవుతుంది. జేమ్స్‌ మ్యాడిసన్‌ హెచ్చరించినట్టుగా Unchecked fragmentation breeds factionalism. కార్పొరేషన్ల విభజన decentralisation కాదు disguised centralisation. పెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఆర్థిక, పరిపాలనా శక్తి ఉంటుంది. విభజనతో ఆ శక్తి కరుగుతుంది. ఇక Urban local bodies are often assigned responsib ilities without corresponding autho rity or financial autonomy. అని ఇషర్‌ జడ్జ్‌ అహ్లూవాలియా కమిటీ హెచ్చరించింది. కొత్త కార్పొరేషన్లు అప్పులపై లేదా రాష్ట్ర ఆర్థిక వనరులపై ఆధారపడవలసి వచ్చే అవకాశం ఎక్కువ.
అసలు సంస్కరణ అంటే ఏమిటి?
ఏదైనా సంస్థలో సమస్యలు ఉంటే ఆ సంస్థను బలపరచాలి.. విభజించకూడదు. ఈ విషయాన్ని అహ్లువాలియా కమిటీ స్పష్టంగా చెప్పింది. India needs empowered city governments with adequate financial resources, professional capacity, and political accountability.
అంటే:
1. సమగ్ర నగర అధికారం
2. ఆర్థిక స్వయం ప్రతిపత్తి
3. వృత్తిపరమైన పట్టణ సేవా దళం
4. మెట్రోపాలిటన్‌ స్థాయి ప్రణాళిక
5. బాధ్యత, అధికారం సమతౌల్యం
ఇది సంస్కరణ కాదు, పురోగమనం
జీహెచ్‌ఎంసీ విభజన నగర సంక్లిష్టతకు పరిష్కారం కాదు. అది సమస్యను మరింత జటిలపరిచే ప్రయోగం. సంస్థలను బలహీనపరచి ప్రజాస్వామ్యాన్ని బలపరచలేం. ఈ విభజనతో సమర్థత రాదు సరికదా, బలహీనతలు వచ్చే అవకాశమే ఎక్కువ అని ఢిల్లీ ఉదంతం స్పష్టం చేస్తున్నది. ఈ నిర్ణయం వల్ల తాత్కాలిక రాజకీయ ప్రయోజనం ఉండవచ్చు కానీ, ఇది దీర్ఘకాలంలో నగర భవిష్యత్తుకు భారమయ్యే అవకాశమే ఎక్కువ.
– పెండ్యాల మంగళా దేవి

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • నిబంధ‌న‌లు పాటించ‌క పోతే సీజ్ చేస్తాం
  • నా వ‌ల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బ‌య‌ట ప‌డింది
  • సెట్విన్ సంస్థ ఎండీగా ఉపేందర్ రెడ్డి
  • కిమ్ వారసురాలిగా కిమ్ కూతురు
  • పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ లో ఆడ‌బోం : ఆఫ్గ‌నిస్తాన్

Recent Comments

No comments to show.

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes