హైదరాబాద్ : ఘనమైన చరిత్ర కలిగిన ఓరుగల్లు చిరకాల వాంఛ తీరనుంది. త్వరలోనే ఎయిర్ పోర్టు రూపుదిద్దుకోనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన వరంగల్ విమానాశ్రయ అభివృద్ధి కోసం భూమిని అప్పగించే కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , కొండా సురే, శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాశ్ , పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య , ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,శాసనసభ్యులు, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒకే ఒక్క ఎయిర్‌పోర్ట్ ఉందని, అందుకే ఈ ప్రజా ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా మూడు ఎయిర్‌పోర్ట్ లను ఏర్పాటు చేయాలని సంకల్పించడం జరిగిందన్నారు ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా తెలుగు రాష్ట్రానికి చెందిన సోదరులు రామ్మోహన్ నాయుడు కావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.
ముఖ్యంగా వరంగల్ ప్రజల చిరకాల కోరికైన ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇద్దరు శాసన సభ్యులు అక్కడ రైతులందరిని ఒప్పించి పూర్తి సహకారంతో ఎయిర్ పోర్ట్ భూములను ఇప్పించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ఆ కోరికను నెరవేర్చుతున్నందుకు కేంద్ర మంత్రికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియ చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం. వీలైనంత తొందరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని కోరారు రామ్మోమన్ నాయుడును.
The post తీరనున్న ఓరుగల్లు ఎయిర్ పోర్టు కల appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
