చిత్తూరు జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంక్రాంతి పండుగ వేళ తీపి కబురు లభించింది. ఆయనపై మోపిన అభియోగం, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో గతంలో 50 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. గత వైసీపీ సర్కార్ హయాంలో ఆయనపై కేసు నమోదు చేశారు. దాదాపు రూ. 300 కోట్లకు పైగా నైపుణ్యాభివృద్ది పేరుతో స్వాహా చేశారని, దుర్వినియోగం అయ్యాయంటూ ఆరోపించారు. ఆపై ఆనాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ )ను ఏర్పాటు చేశారు. ఇవాళ విజయవాడ కోర్టులో విచారణ చేపట్టిన కోర్టు సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు చంద్రబాబు నాయుడుకు క్లీన్ చిట్ లభించింది. దీంతో ఆయన కుటుంబం అంతా సంతోషానికి లోనయ్యారు.
ఆయన తన కుటుంబంతో కలిసి చిత్తూరు జిల్లా లోని తన స్వంత గ్రామం నారా వారి పల్లె కు వెళ్లారు. సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, కొడుకు, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు మనుమడు నారా బ్రాహ్మణి లు గ్రామనికి చేరుకున్న వెంటనే ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామంలోని చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, కాక్ ఫైట్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలను నిర్వహించారు. వీటన్నింటినీ సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించి సంతోషంగా గడిపారు. క్రీడల్లో చంద్రబాబు, బాలకృష్ణల మనవళ్లు కూడా పాల్గొన్నారు. అనంతరం ఆటల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు.
చిన్నారులందరితో ఫోటోలు దిగి ఆప్యాయంగా సీఎం చంద్రబాబు ముచ్చటించారు. దాదాపు రెండు గంటల సేపు గ్రామస్తులు, చిన్నారులతో సీఎం చంద్రబాబు తన కుటుంబంతో గడిపారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి బహుమానాలు అందించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలను అందుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
The post నారావారి పల్లెలో చంద్రబాబు ఫ్యామిలీ సందడి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
