మంగళగిరి: కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం 87వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై పార్టీ కార్యాలయానికి తరలి వచ్చిన సామాన్యులు, పార్టీ కార్యకర్తలను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా (సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్ (గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేగా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.
ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో గత 20 ఏళ్లుగా పని చేస్తున్న దినసరి వేతన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ దినసరి ఉద్యోగుల కమిటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష ను కలిసి కోరారు. కోవిడ్ వల్ల నష్టపోయిన హైర్ బస్ యజమానుల బస్సులకు రీప్లేస్ మెంట్ కల్పించి ఆదుకోవాలని ఏపీ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో తమకు వంశ పారంపర్యంగా సంక్రమించిన 2.63 ఎకరాల భూమిని శిరిగిరి చంద్రమౌళీశ్వర రెడ్డి ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని కర్నూలు జిల్లా గుండంపాడుకు చెందిన ఎస్.చిన్న శివమ్మ మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
The post నారా లోకేష్ 87వ రోజు ప్రజా దర్బార్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
