హైదరాబాద్ : డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ మూవీ దుమ్ము రేపుతోంది. ఇప్పటికే బాలయ్య సినీ కెరీర్ లో రూ. 130 కోట్లు వసూలు చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ సాధించే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే అఖండ -2 మూవీ అద్బుతంగా ఉందని, భారతీయ సంస్కృతిని పరిరక్షించేలా ఉందంటూ కితాబు ఇచ్చారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధిపతి మోహన్ భగవత్. దీంతో పాటు కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ సైతం సూపర్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడింది అఖండ -2 చిత్రానికి. దీనిని చేజిక్కించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. కానీ చివరకు అమరికాకు చెందిన ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. అయితే అఖండ -2 ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే దానిపై ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు.
సినీ వర్గాల నుంచి అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు సంక్రాంతి పండుగ కంటే ముందే అంటే జనవరి 9వ తేదీన స్ట్రీమింగ్ కానుందని టాక్. ఈ స్ట్రీమింగ్ దిగ్గజం సినిమా డిజిటల్ హక్కులను పొందినప్పటికీ ప్రీమియర్ తేదీకి సంబంధించి ప్రకటన చేయక పోవడం పట్ల ఉత్కంఠ నెలకొంది నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో. ఇదిలా ఉండగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వరుసగా ఇది నాలుగో సినిమా కావడం విశేషం. ఇక అఖండ -2 మూవీలో బాలకృష్ణతో పాటు ఆది పినిశెట్టి, కబీర్ దుహాన్ సింగ్, హర్షాలీ మల్హోత్రా , శశ్వత ఛటర్జీ ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ ప్రాజెక్ట్ను రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. రూ. 50 కోట్లకు పైగా ఖర్చు అవుతే రూ. 100 కోట్లకు పైగా రావడం విశేషం.
The post నెట్ ఫ్లిక్స్ లో బాలయ్య అఖండ స్ట్రీమింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
