ముల్లాన్ పూర్ : ఐపీఎల్ 2026లో హాట్ ఫెవరేట్ గా బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ సత్తా చాటింది. తన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఆల్ రౌండ్ షోతో దుమ్ము రేపింది. ముల్లాన్‌పూర్ వేదికగా టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని 3 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. మ్యాచ్ లో భాగంగా తొలుత మైదానంలోకి దిగింది గుజరాత్. నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులే చేసింది. అనంతరం లక్ష్యం చిన్నది కావడంతో 19.1 ఓవర్లలోనే పని కానిచ్చేసింది. 7 వికెట్లు కోల్పోయి విక్టరీ సాధించింది. ఇక ఈ లీగ్‌లో అరంగేట్ర మ్యాచ్ ఆడిన కూపర్ కనోలి అద్భుతంగా ఆడాడు. తను 44 బంతులు ఎదుర్కొన్నాడు. 72 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇందులో 5 ఫోర్లు 5 సిక్సులు ఉన్నాయి. ప్రభ్ మన్ సింగ్ 24 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 4 సిక్సులతో విరుచుకు పడ్డాడు. 37 రన్స్ చేశాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తన ప్లాన్ ఫలించింది. మైదానంలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 రన్స్ చేసింది. గిల్ 39 రన్స్ చేస్తే జోస్ బల్టర్ 38 పరుగులు చేశాడు. మిగతా ప్లేయర్లంతా చాప చుట్టేశారు. పెవిలియన్ బాట పట్టారు. ఇదిలా ఉండగా అనంతరం మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ఆదిలోనే ప్రియార్ ఆర్య వికెట్ ను కోల్పోయింది. ప్రభ్ సిమ్రన్ , కనోలీ ఇద్దరూ కలిసి గుజరాత్ బౌలర్లను ఏకి పారేశారు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
The post పంజాబ్ కింగ్స్ షాన్ దార్ షో appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
