Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

ఫోన్‌ట్యాపింగ్‌ కేసు విచారణ 14కు వాయిదా

Ai generated article, credit to orginal website, October 9, 2025

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (నమస్తే తెలంగాణ) : ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు 14వ తేదీకి వాయిదా వేసింది. ఆ పిటిషన్‌పై జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ మహదేవన్‌ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతా వాదనలు వినిపించారు. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక వచ్చిందని, అందులో కీలకమైన ఆధారాలు లభించాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ను రద్దుచేయాలని విన్నవించారు. ఇదిలాఉండగా తెలంగాణ ప్రభుత్వం తరపున తుషార్‌మెహతా వాదనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పోస్టును కేంద్ర హోంశాఖ భర్తీ చేస్తుంది. ఆ స్థానంలో ఉన్న ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు తరపున వాదనలు వినిపించడం చర్చనీయమైంది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • Election Commission: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌-2
  • Mahagathbandhan: ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం – మహాగఠ్‌బంధన్‌ మ్యానిఫెస్టో
  • Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
  • Delhi Airport: దిల్లీ ఎయిర్‌పోర్టులో బస్సు దగ్ధం
  • APEPDCL: మొంథా తుఫానుపై అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్

Recent Comments

No comments to show.

Archives

  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes