Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా డైమండ్ డెకాయిట్

Ai generated article, credit to orginal website, April 10, 2026

హైద‌రాబాద్ : టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా “డైమండ్ డెకాయిట్” చిత్రం ఏప్రిల్ 10న శుక్ర‌వారం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా థియేటర్ లలో విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మహిళా ప్రేక్షకులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో 4 షోలు మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. మహిళలు ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు వచ్చి సినిమాను ఆస్వాదించాలని చిత్ర బృందం కోరింది.
ఈ చిత్రంలో పార్ధా గోపాల్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరించారు. మేఘనా రెడ్డి హీరోయిన్‌గా నటించారు. రచయిత–దర్శకుడు సూర్య జి. యాదవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తి కుటుంబ వినోదంతో పాటు హృద్యమైన భావోద్వేగాలతో కూడిన ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా చూస్తే కన్నీళ్లు ఆపుకోవడం కష్టమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ మూవీ ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు ట్రైలర్‌ను వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారు. ఇప్పటికే నిర్వహించిన ప్రివ్యూ షోలలో పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు.
హీరో గోపాల్ మాట్లాడుతూ డైమండ్ డెకాయిట్ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ప్రతి కుటుంబం కనెక్ట్ అయ్యేలా కథ ఉంటుందన్నారు. కడపలో చిత్రీకరించిన అందమైన లొకేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. మహిళలకు 4 షోలు ఉచితంగా ఏర్పాటు చేశాం. అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలి అని కోరారు. దర్శకుడు సూర్య జి. యాదవ్ మాట్లాడుతూ 33 ఏళ్ల క్రితం వచ్చిన మాతృదేవోభవ సినిమా ప్రేక్షకుల హృదయాలను ఎంతగా కదిలించిందో మనందరికీ తెలిసిందేన‌ని, ఆ తరహా భావోద్వేగాన్ని మళ్లీ ఈ తరం ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నమే ‘డైమండ్ డాకోయిట్’ అని పేర్కొన్నారు.
The post ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా డైమండ్ డెకాయిట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Top Stories

Post navigation

Previous post

Recent Posts

  • ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా డైమండ్ డెకాయిట్
  • సీనియ‌ర్ సిటిజ‌న్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి
  • టీవీకే విజ‌య్ కి రాజ‌కీయ ప‌రిణితి లేదు
  • గోదావ‌రి పుష్క‌రాల కంటే పోల‌వ‌రం పూర్తి చేస్తాం
  • సమాజాభివృద్ది కోసం కంపెనీలు స‌హ‌క‌రించాలి

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes