Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

బీజేపీ రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ కరువు.. 66 వేల కేసులతో ఉత్తరప్రదేశ్‌ టాప్‌

Ai generated article, credit to orginal website, October 11, 2025

దేశవ్యాప్తంగా 4.5 లక్షల మంది మహిళలపై నేరాలు-ఘోరాలు
టాప్‌-5లో నాలుగు బీజేపీ పాలిత రాష్ర్టాలే..
ఎన్సీఆర్బీ- 2023 నివేదికలో కీలక విషయాలు వెల్లడి

(స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో) హైదరాబాద్‌, అక్టోబర్‌ 10 (నమస్తే తెలంగాణ) : ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ (BJP) ప్రభుత్వ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 2023 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4.5 లక్షల మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో బీజేపీపాలిత రాష్ర్టాలు ముందంజలో ఉన్నాయి. టాప్‌-5 రాష్ర్టాల్లో నాలుగు రాష్ర్టాల్లో బీజేపీనే అధికారంలో ఉన్నది. ఈ మేరకు జాతీయ నేర గణాంక శాఖ (NCRB-2023) విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి అర్థమవుతున్నది.
గృహహింస, రేప్‌లే ఎక్కువ
2023 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4,48,211 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగినట్టు ఎన్సీఆర్బీ-2023 నివేదిక స్పష్టం చేసింది. మహిళలపై నేరాల్లో 66,381 కేసులతో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉండగా, 47,101 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 45,450 కేసులతో రాజస్థాన్‌ మూడో స్థానంలో నిలిచింది. పై మూడు రాష్ర్టాల్లో బీజేపీనే అధికారంలో ఉండటం గమనార్హం. మహిళలపై నేరాల్లో గృహహింస, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు, హత్యలు, కిడ్నాప్‌లు తదితరాలు ప్రధానంగా ఉన్నాయి. ఇక చిన్నారులపై జరుగుతున్న నేరాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒక్క ఏడాదిలోనే 1,77,335 మంది పిల్లలపై దారుణాలు జరిగాయి. 2022తో పోలిస్తే 2023లో పిల్లలపై నేరాలు 9.2 శాతం మేర పెరిగాయని నివేదిక వెల్లడించింది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • గోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలి
  • సంజు శాంస‌న్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
  • ఔను వాళ్లిద్దరు ఇష్ట‌ప‌డ్డారు
  • జ‌గ‌న్ రెడ్డికి విమ‌ర్శించే అర్హ‌త లేదు : స‌విత‌
  • టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ న‌జ‌రానా

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes