Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

మక్కల కొనుగోలుకు సర్కారు నిర్ణయం

Ai generated article, credit to orginal website, October 10, 2025

ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం
‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన

హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 (నమస్తే తెలంగాణ) : మక్కల కొనుగోలుపై ప్రభుత్వంలో కదలిక వ చ్చింది. మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించినట్టు చెప్పారు. బహిరంగ మార్కెట్లో ధర పడిపోవడం, మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5న ‘నమస్తే తెలంగాణ’ ‘ప్రభుత్వం చెప్పదు.. మార్క్‌ఫెడ్‌ కొనదు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది.
దీంతో కదిలిన ప్రభుత్వం మక్కల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. గురువారం తుమ్మల మాట్లాడుతూ మక్కలను క్వింటాల్‌కు ధర రూ.2400 మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్‌ను ఆదేశించారు. రాష్ట్రం లో 6,24,544 ఎకరాల్లో మక్క సాగయిందని, 11.56 లక్షల టన్నుల పం ట ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. ఈ సీజన్‌లో 8.66 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలు కొనుగోలు చేయాల్సి ఉం టుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • చ‌రిత్రను తిర‌గ రాసిన టీం ఇండియా
  • జ‌స్ప్రీత్ బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్
  • టీం ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత
  • చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్
  • అద్భుతంగా బమృకున్ – ఉద్ – దౌలా చెరువు

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes