హైదరాబాద్ : తాను నటించిన మన శంకర వర ప్రసాద్ గారు ఆల్ రెడీ సూపర్ హిట్ అయ్యిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. వెంకటేష్ తో కాంబినేషన్ అదిరి పోతుందన్నారు. ఇది పండగ లాంటి సినిమా. అందరూ చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పారు. దర్శకుడు అనిల్ రావిపూడి చాలా అద్భుతంగా సినిమాను తీశాడని ప్రశంసించారు. ఇక నయనతార గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయని చెప్పారు చిరంజీవి. దీనిని పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. తన సినీ కెరీర్ లో ఈ చిత్రం మరిచి పోలేని మూవీగా ఉండి పోతుందన్నారు.
ఇదిలా ఉండగా ఈ మూవీలో ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లు అద్భుతంగా జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
రెండో విజయం 12 తారీఖున ఎంత ఘన విజయం ఇస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు మెగాస్టార్. నా తమ్ముడు వెంకటేష్ తో సినిమా చేయడం అనేది చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. వెంకటేష్ చాలా పాజిటివ్ పర్సన్. తనతో కూర్చుంటే చాలా ఫిలాసఫికల్ గా అనిపిస్తుంది. మోడరన్ డ్రెస్ వేసుకున్న చిన్న సైజు గురువు లాగా అనిపిస్తుంటాడు. తనతో మాట్లాడుతుంటే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మేము చాలా సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టిల్ ఫోటో దిగడం జరిగింది. మనిద్దరం కలిసి ఇలాంటి ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. అనిల్ ద్వారా ఎన్నాళ్లకు అది కుదిరింది. అనిల్ రావిపూడి మాత్రమే దానికి జస్టిఫికేషన్ చేయగలిగాడు. మా కాంబినేషన్ చాలా అద్భుతంగా వచ్చింది. అది మీరు థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. వెంకీ నేను ఇద్దరం చాలా ఎంజాయ్ చేశాం. ఇది యాక్టింగ్ చేసేలా ఉండదు. ఇద్దరు కుర్రాళ్ళు కలిసి అల్లరి చేసినట్టుగా ఉంటుంది. మీరందరూ ఎంజాయ్ చేస్తారని అన్నారు చిరంజీవి.
The post ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఆల్రెడీ సూపర్ హిట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
