మస్కట్: వేల సంవత్సరాల క్రితంనాటి భారతీయ ‘కుట్టు నిర్మాణ’ పద్ధతిలో తయారైన నౌక ‘ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య’ బుధవారం మస్కట్ తీరానికి చేరుకుంది. ఎటువంటి ఇంజిన్ లేకుండా, పూర్తిగా తెరచాపల సాయంతో సముద్రంపై 750 నాటికల్ మైళ్ల దూరం (1,400 కిలోమీటర్లు) ప్రయాణించింది. లోహపు మేకులు లేకుండా, కొబ్బరి నార, కలపతో తయారుచేసిన ఈ నౌక 18 రోజులపాటు సముద్రయానం చేసింది.
