హైదరాబాద్ : ప్రిన్స్ మహేష్ బాబు, అందాల తార ప్రియాంక చోప్రా కీ రోల్స్ పోషించిన చిత్రం వారణాసి. దీనికి దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ తో దీనిని తెరకెక్కించాడు. ఇప్పటికే వారణాసి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలు, గ్లింప్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. సినిమా ప్రారంభం నుంచి ఇప్పటి దాకా ఉత్కంఠ పెంచుతూ పోతున్నాడు దర్శకుడు రాజమౌళి అలియాస్ జక్కన్న. ఇదిలా ఉండగా వారణాసి చిత్రంపై నెలకొన్న అనుమానాలకు తెర దించే ప్రయత్నం చేశారు మూవీ మేకర్స్. శుక్రవారం మూవీ మేకర్స్ అధికారికంగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు ప్రతిష్టాత్మకంగా వారణాసి సినిమాను. రాజమౌళి సోదరుడు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఆయన సినిమాలన్నింటికీ కీరవాణే మ్యూజిక్ ఇస్తూ వచ్చాడు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు మరో ముఖ్యమైన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. కాగా వారణాసి మూవీతో లవ్లీ బ్యూటీ ప్రియాంక చోప్రా సుదీర్ఘ కాలం తర్వాత భారతీయ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో తను మందాకిని పాత్రలో నటిస్తోంది. ఇక వారణాసి మూవీ టైటిల్ ను గత ఏడాది 2025 నవంబర్ 15న ఆవిష్కరించారు. చిత్ర నిర్మాతలు ఈ రోజు గ్లింప్స్‌ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ విషయాన్ని పంచుకుంటూ, ఎస్ఎస్ రాజమౌళి పోస్ట్‌కు వారణాసి టు ది వరల్డ్ అని క్యాప్షన్ ఇచ్చారు.
The post మహేష్ బాబు ‘వారణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
