వడోదర : కీవీస్ తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు విజయాన్ని నమోదు చేసింది. మరోసారి సత్తా చాటాడు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. 37 ఏళ్ల వయసులో 91 బంతుల్లో 93 రన్స్ చేశాడు. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత్ ముందు 301 రన్స్ లక్ష్యాన్ని ఉంచింది. దీంతో అనంతరం బరిలోకి దిగిన ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేశాడు. సయీద్ అజ్మల్ తొమ్మిదో ఓవర్లో ఓపెనర్ రోహిత్ శర్మ 26 పరుగుల వద్ద అవుటయ్యాడు. కోహ్లీ రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లడానికి నిరాకరించాడు. దానికి బదులుగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో (56) కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ కలిసి 118 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
న్యూజిలాండ్ బౌలర్లు ఎంతగా ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వన్డే సీరీస్ లో భాగంగా మూడు మ్యాచ్ లు ఆడుతాయి ఇరు జట్లు. దీంతో ఇండియా 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది భారత జట్టు. వన్డే ఫార్మాట్ లో తను కీలకంగా మారాడు. విరాట్ కోహ్లీ క్రికెట్ కెరీర్ లో 17 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రపంచ క్రికెట్ రంగంలో టాప్ లో కొనసాగుతున్నాడు రన్ మెషీన్. వరుసగా 50 పరుగులు చేయడం ఇది ఐదోసారి. కొత్త సంవత్సరంలో తన జోరును కొనసాగించాడు కోహ్లీ. ఇదిలా ఉండగా టి20 ఫార్మాట్ నుంచి శుభ్ మన్ గిల్ ను తొలగించారు. వన్డే సీరీస్ లో తప్పిస్తాడని అంతా అనుకున్నారు.
The post మెరిసిన విరాట్ కోహ్లీ తొలి వన్డేలో ఇండియా విక్టరీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
