విజయవాడ : చుక్క పాలు వినియోగించకుండానే, ఆవులు లేకుండానే 60 లక్షల కేజీల కల్తీ నెయ్యిని వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో వినియోగించారని సంచలన ఆరోపణలు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఇదే విషయాన్ని సిట్ తన నివేదికలో వెల్లడించిందని అన్నారు. జంతువుల కొవ్వు కలిసింది అనేది స్పష్టంగా చెప్పారు. రిపోర్టులను తారుమారు చేసి వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కల్తీ నెయ్యి వినియోగించి దొరికిపోయిన దొంగ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు పెట్టి అల్లర్లు సృష్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లు బూతు రాజకీయాలు చేసిన వైసీపీ శ్రేణులు, నేటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నారని ఆవేదన చెందారు. చట్ట ప్రకారమే వైసీపీ సైకో ముఠాకు తగిన బుద్ధి చెబుతాం అన్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా వైసీపీ నాయకుల్లో ఇంకా మార్పు రాలేదన్నారు. జగన్ను చూసి భూమన, అంబటి, జోగి లాంటి నేతలు యథా రాజా థతా ప్రజా అన్నట్టు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు.. పోలవరం, అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వడం, డేటా సెంటర్లు, స్పీడ్ ట్రైన్లకు నిధులు కేటాయించారని తెలిపారు.. పెట్టుబడులను ఆకర్షించేలా కేంద్రం బడ్జెట్ ఉందన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు. సీఎం చంద్రబాబు రోజుకు 20 గంటలు రాష్ట్రం కోసం పని చేస్తున్నారని అన్నారు. ఇలాంటి మంచి వాతావరణంలో బడ్జెట్ పై చర్చించకుండా కులాలు, మతాలు రెచ్చగొట్టే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తుండడం బాధాకరమని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు, లోకేష్ లు యజ్ఞం చేస్తుంటే… జగన్, సైకో ముఠా రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
The post వైసీపీ నేతలు అభివృద్ది నిరోధకులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
