తిరుమల : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తుల బృందంతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆలయ అర్చకులతో కలిసి మేళతాళాల నడుమ, వేద మంత్రోచ్ఛారణతో సాంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం టీటీడీ చైర్మన్, ఈవోలు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు . ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి శ్రీ వరాహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం, సీవీ, ఎస్వో మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మీడియాతో మాట్లాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కోవడం ఆనందంగా ఉందన్నారు. ఆ దేవ దేవుడు దేశ ప్రజలకు సుఖ సంతోషాలు కలుగ చేయాలని ప్రార్థించినట్లు తెలిపారు.
The post శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
