హైదరాబాద్ : మరోసారి కలిసి సినిమా చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు పీపుల్స్ మీడియా సంస్థ అధినేత టీజీ విశ్వ ప్రసాద్. ఆయన తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో కలిసి రాజా సాబ్ తీశారు. అది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. ఆశించిన మేర రెస్పాన్స్ రాలేదు. కానీ వసూళ్లు కూడా నెమ్మదిగా వస్తున్నాయని, తన సినిమా పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేశాడు ప్రముఖ దర్శకుడు మారుతి. చాలా మంది కావాలని తనను, తమ సినిమాను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు . తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఈ తరుణంలో పీపుల్స్ మీడియా అధినేత షాకింగ్ ప్రకటన చేయడం కూడా మరింత ఆసక్తిని కలిగించేలా చేసింది టాలీవుడ్ లో.
బుధవారం సోషల్ మీడియా వేదికగా టీజీ విశ్వ ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పనిచేయనుందని స్పష్ట చేశారు. దీనిని ప్రకటించినందుకు తాము ఆనంద పడుతున్నామన్నారు. పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కింద రాబోయే చిత్రంలో నటించడంతో పాటు నిర్మించనున్నారని తెలిపారు. భోగి పండుగ శుభ సందర్భంగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన టీజీ విశ్వ ప్రసాద్‌తో కలిసి ఓజీ నటుడి చిత్రాన్ని రెండు నిర్మాణ సంస్థలకు సంబంధించిన బృందాలు పంచుకున్నాయి. ఈ సమావేశంలో వారి భవిష్యత్ సహకారాలపై తదుపరి చర్చలు జరిపినట్లు భావిస్తున్నారు.
The post సంక్రాంతి వేళ పవర్ స్టార్ తో మరో మూవీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
