బెంగళూరు : కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం ఎలాంటి పోరు లేదన్నారు. తనతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం స్పందించారు. మీడియాతో మాట్లాడారు. గతంలో ఏ పార్టీలో లేని విధంగా పోరు ఉందంటూ చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు ఇది మంచి పద్దతి కాదన్నారు. సీఎం మార్పుపై ఊహాగానాలు అన్నీ పుకార్లేనంటూ పేర్కొన్నారు. తనతో పాటు డీకే మధ్య ఎలాంటి పోరు లేదన్నారు సిద్దరామయ్య. విద్వేష ప్రసంగాల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపవద్దని బీజేపీ ఆయనను కోరాలని యోచిస్తున్నప్పటికీ, ఈ బిల్లు గురించి వివరించడానికి తాను గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను కలుస్తానని అన్నారు.
అయితే సిద్దరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరం మంచి స్నేహితులమని స్పష్టం చేశారు మరోసారి. ఇదంతా మీడియా సృష్టించిన కథనాలే తప్పా మరోటి కాదన్నారు. ఎక్కడ పోరు ఉందో చెప్పాలన్నారు. అనవసరంగా మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని అన్నారు. ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోరు మళ్లీ ప్రారంభమవుతుందని పేర్కొంటూ బీజేపీ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దరామయ్య. నవంబర్ 20న కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలంలో సగం పూర్తి చేసుకున్న తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
The post సీఎం కుర్చీ కోసం ఎలాంటి పోరు లేదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
