విజయవాడ : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. గత జగన్ రెడ్డి సర్కార్ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లో భారీ స్కాం జరిగిందని సిట్ కేసు టేకోవర్ చేసింది. ఈమేరకు చంద్రబాబు నాయుడును జైలుకు పంపించారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. ఏకంగా కూటమి సారథ్యంలో ఏపీలో సర్కార్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తన పాలన రెండు ఏళ్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి మంగళవారం కేసు విచారణ జరిగింది. ఈ సందర్బంగా క్లీన్ చిట్ లభించడంతో ఊపిరి పీల్చుకున్నారు సీఎం. సాయంత్రం 4:28 గంటలకు దర్యాప్తు సంస్థ ముఖ్యమంత్రి ప్రమేయం ఏమీ లేదని గుర్తించింది.
తదనుగుణంగా కోర్టులో ఒక మెమోను దాఖలు చేసింది, దీనిని న్యాయాధికారి ఆమోదించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల దుర్వినియోగంలో ఆయన ప్రమేయం ఉందనే ఆరోపణలపై దాఖలైన కేసును విజయవాడలోని స్థానిక కోర్టు మూసి వేసింది. ఈ కేసు ప్రకారం, ఈ దుర్వినియోగం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 300 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అక్టోబర్ 31, 2023న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి ముందు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 50 రోజులకు పైగా గడిపారు. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ కేసులో ముఖ్యమంత్రి ప్రమేయం ఏమీ లేదని సీఐడీ గుర్తించిందని, తదనుగుణంగా కోర్టులో ఒక మెమోను దాఖలు చేసిందని, దానిని న్యాయాధికారి ఆమోదించారని తెలిపారు.
The post స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబుకు క్లీన్ చిట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
