Jeep Compass Track Edition: జీప్ (Jeep) ఇండియా తాజాగా భారత మార్కెట్ కోసం కంపాస్ ట్రాక్ ఎడిషన్ (Compass Track Edition) ను లాంచ్ చేసింది. ఇది లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ కాగా, సాధారణ కంపాస్ మోడల్‌తో పోలిస్తే కొన్ని ప్రత్యేక అప్‌గ్రేడ్స్ తో వస్తోంది. ఈ కొత్త ఎడిషన్ కంపాస్ మోడల్ S ఆధారంగా రూపొందించబడింది. ట్రాక్ ఎడిషన్ లో సిగ్నేచర్ హుడ్ డికల్, పియానో బ్లాక్ గ్రిల్ డీటైల్స్, బ్యాడ్జ్‌లపై స్పెషల్ ఫినిషింగ్ వంటి స్టైలిష్ మార్పులు ఉన్నాయి. ఇక SUV ప్రత్యేకతను చూపించేందుకు “Track Edition” బ్యాడ్జ్ ను కూడా జోడించారు. అలాగే, 18 అంగుళాల డైమండ్ కట్ టెక్ గ్రే అల్లాయ్ వీల్స్ ఇవ్వబడ్డాయి.
Team India: ధోనీ, కోహ్లీ, గంగూలీ.. అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించింది ఎవరు?
క్యాబిన్ లో కూడా కొత్తతనం కనిపిస్తుంది. టుపెలో లేథెరెట్టే సీట్స్, స్మోక్ క్రోమ్ ఫినిష్‌లు, స్ప్రూస్ బీజ్ స్టిచింగ్, ఎంబాస్‌డ్ జీప్ బ్రాండింగ్ తో ఇంటీరియర్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్, పియానో బ్లాక్ ఇన్సర్ట్స్, ట్రాక్ ఎడిషన్ ఫ్లోర్ మ్యాట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఇన్ఫోటైన్‌మెంట్ సెక్షన్‌లో 10.1 అంగుళాల Uconnect టచ్‌స్క్రీన్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వైర్‌లెస్ కనెక్టివిటీతో వస్తుంది. వీటితోపాటు 10.25 అంగుళాల డిజిటల్ గేజ్ క్లస్టర్, ఆల్పైన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.
Pakistan: భారత్, ఇజ్రాయిల్‌లతో పాకిస్తాన్ డేంజరస్ గేమ్.. “ఇస్లామిక్ నాటో” ఏర్పాటు చేస్తోందా..?
ఇక కంఫర్ట్ కోసం 8-వే ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ వెంటిలేటెడ్ సీట్స్ (మెమరీ ఫంక్షన్‌తో), అలాగే డ్యూయల్-పేన్ పానొరామిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. సుదీర ప్రయాణాల్లో ఆహ్లాదకరమైన అనుభూతిని ఇవి అందిస్తాయి. ఇక ధర విషయానికి వస్తే బేస్ వెర్షన్ రూ.26.78 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఆటోమేటిక్ వెర్షన్ రూ.28.64 లక్షలు, అత్యంత ఖరీదైన 4×4 వెర్షన్ రూ.30.58 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తుంది.
Adventure’s next great chapter is about to unfold with an SUV that’s set to make the rest restless. Will you make the cut? Jeep® Compass Track Edition – Coming sooner than you think.#jeep #jeepindia #jeeplife #TrackEdition
[Jeep®, Jeep®India, Jeep®Compass, Off-roading,… pic.twitter.com/krVNHUYNiq
— Jeep India (@JeepIndia) October 7, 2025
Many show off, few can show what they are made of.Do you make the cut?Presenting the exclusive Jeep® Compass Track Edition.
Scroll to see for yourself what a real SUV is made of.
Book now!#jeep #jeepindia #jeeplife #TrackEdition
[Jeep®, Jeep®India, Jeep®Compass,… pic.twitter.com/teOKmzp1vA
— Jeep India (@JeepIndia) October 8, 2025
