Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

‘స్థానికం’పై 7న నిర్ణయం

Ai generated article, credit to orginal website, October 24, 2025

ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ ఆర్డినెన్స్‌
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ తవ్వకానికి గ్రీన్‌సిగ్నల్‌
వేగంగా సూపర్‌స్పెషాలిటీ దవాఖానల పనులు
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 23 (నమస్తేతెలంగాణ): హైకోర్టు తీర్పు కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై తాజాగా జరిగిన క్యాబినెట్‌ భేటీలోనూ క్లారిటీ రాలేదు. నవంబర్‌ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన క్యాబినెట్‌ సమావేశ వివరాలను రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌ నవంబర్‌ 3న హైకోర్టులో విచారణకు రానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తామని వెల్లడించారు. అలాగే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 21(3)ని తొలగించేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని వివరించారు. అసెంబ్లీని ప్రోరోగ్‌ చేసినందున ఆర్డినెన్స్‌ ప్రతిపాదన ఫైల్‌ను గవర్నర్‌కు పంపించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వరంగల్‌ సూపర్‌స్పెషాలిటీ దవాఖాన, ఎల్‌బీ నగర్‌, సనత్‌నగర్‌, అల్వాల్‌ టిమ్స్‌ నిర్మాణ పనుల్లో వేగంపెంచాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించిందని తెలిపారు.
రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలు ఆమోదించినట్టు పేర్కొన్నారు. రామగుండంలో 52 ఏండ్ల క్రితం నాటి థర్మల్‌ స్టేషన్‌(ఆర్టీఎస్‌-బీ 62.5 మెగావాట్ల యూనిట్‌) కాలపరిమితి ముగియడంతో దానిని తొలగించాలని క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. భవిష్యత్తు విద్యుత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని విద్యుత్తు శాఖ అధికారులను క్యాబినెట్‌ ఆదేశించినట్టు చెప్పారు.
అధునాతన పద్ధతిలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను పునరుద్ధరించాలని క్యాబినెట్‌ భేటీలో నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. 44 కిలోమీటర్ల పనుల్లో ఇప్పటివరకు 35 కిలోమీటర్ల తవ్వకం పనులు పూర్తయినందున మిగిలిన సొరంగం పనులను అధునాతన డ్రిల్లింగ్‌ విధానంలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. పూర్వపు కాంట్రాక్ట్‌ ఏజెన్సీకే సొరంగం తవ్వకం పనులు బాధ్యతలు అప్పగించాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 2028 జూన్‌ నాటికి ఎస్‌ఎల్‌బీసీని పూర్తిచేసి గ్రావిటీ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఉమ్మడి నల్లగొండకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని మంత్రి వివరించారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఏపీపై విశ్వాసానికి ప్రతీక ఏఎంఎన్ఎస్ స్టీల్ ప్లాంట్
  • దేశంలో పెట్రోల్, గ్యాస్ కు ఎలాంటి కొర‌త లేదు
  • తెలంగాణ బీజేపీ నాయ‌క‌త్వంపై ఈట‌ల గుస్సా
  • ఐపీఎల్ వేలంపై రాబిన్ ఉతప్ప షాకింగ్ కామెంట్స్
  • ప‌శ్చిమాసియా యుద్దానికి తాత్కాలిక విరామం

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes