హైదరాబాద్ : అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, లవ్లీ బ్యూటీ నయన తార, టీవీకే గణేష్ కలిసి నటించిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు మూవీ గురించి కీలక అప్ డేట్ వచ్చింది. శుక్రవారం మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. మెగా ఫ్యామిలీతో పాటు వెంకీ ఫ్యాన్స్ సైతం ఎంతగానో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా అని. ఇప్పటికే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి 12న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఎవరూ ఊహించని రీతిలో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ప్రత్యేకించి చిరంజీవి సినీ కెరీర్ లో అత్యధికంగా వసూలు చేసిన మూవీగా ఇది రికార్డ్ సృష్టించింది.
అంతే కాదు దర్శకుడు అనిల్ రావిపూడి సినీ కెరీర్ లో ఇది వరుసగా తొమ్మిదవ సినిమా. ప్రతి మూవీ బిగ్ సక్సెస్ కొట్టింది. గతేడాది విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షితో తీసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ దుమ్ము రేపింది. అది ఏకంగా రూ. 300 కోట్లు వసూలు చేసింది. సినీ ప్రేక్షకులను విస్తు పోయేలా చేసింది. మరో వైపు ఈ ఏడాది వచ్చిన మెగాస్టార్ మూవీ మెగా సక్సెస్ అయ్యింది. ఈ చిత్రం కూడా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. మరో వైపు దీనికి పోటీగా విడుదలైన ప్రభాస్ ది రాజా సాబ్ బోల్తా పడింది. ఇదిలా అండగా మెగా ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పారు దర్శకుడు. భారీ ధరకు కొనుగోలు చేసింది జీ గ్రూపు సంస్థ. ఈనెల 11న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.
The post 11న ఓటీటీలో రానున్న మెగాస్టార్ మూవీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
