ఢిల్లీ : టీవీకే పార్టీ చీఫ్, తమిళ సినీ రంగంలో టాప్ హీరోగా పేరు పొందిన టీవీకే విజయ్ నటించిన జయ నాయగన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా చిత్రానికి సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదే సమయంలో ధర్మాసనం కీలక సూచన చేసింది. జనవరి 20వ తేదీలోగా ఈ కేసును పరిష్కరించాలని మద్రాస్ హైకోర్టును ఆదేశించింది. సినిమా ధృవీకరణ ప్రక్రియను నిలిపి వేసింది మద్రాస్ హైకోర్టు. ఈ సందర్బంగా జన నాయగన్ తరపున లాయర్ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానంలో మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ దీపాంకర్ దత్తా, ఎ.జి. మసిహ్ లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది గురువారం.
విచారణ అనంతరం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ పై తాము జోక్యం చేసుకోమని, అయితే జన నాయగన్ విడుదల తేదీకి సంబంధించి తక్షణమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను చిత్ర నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి దాఖలు చేసింది. చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి ఇచ్చిన మునుపటి ఆదేశంపై స్టే విధించిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వును నిర్మాత సవాలు చేశారు. ఇదిలా ఉండగా జన నాయగన్ జనవరి 9న పొంగల్ సందర్భంగా విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నారు . ఇప్పటికే మూవీ రిలీజ్ కు సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఊహించని రీతిలో జన నాయగన్ విడుదల ఆగి పోయింది.
The post 20వ తేదీ లోగా జన నాయగన్ పై తీర్పు ఇవ్వండి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
