Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

60శాతం ప్రైవేట్‌ బడికే!.. రాష్ట్రంలో సర్కారు స్కూళ్లు ఎక్కువ.. విద్యార్థులు తక్కువ

Ai generated article, credit to orginal website, October 16, 2025

సర్కారు బడుల్లో చదువుతున్నది 31 శాతమే
గురుకులాల్లో చేరింది 7.3 శాతమే
1,897 సర్కారు బడుల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్‌
ఒక్క విద్యార్థితో నడుస్తున్నవి 55
10 వేలకుపైగా బడుల్లో చదువున్నది 30 మంది లోపే
సర్కారు బడుల్లో ఆందోళన కలిగిస్తున్న ఎన్‌రోల్‌మెంట్‌

‘స్కూళ్లు ఎక్కువ.. విద్యార్థులు తక్కువ’ఇదీ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల స్థితి‘స్కూళ్లు తక్కువ.. విద్యార్థులు ఎక్కువ’ ఇదీ ప్రైవేట్‌ స్కూళ్లల్లో పరిస్థితి.
హైదరాబాద్‌, అక్టోబర్‌ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 60.77 లక్షల మంది విద్యార్థులుంటే (Students), అందులో 36.17 లక్షల మంది విద్యార్థులు (దాదాపు 60%) ప్రైవేట్‌ స్కూళ్లలోనే (Private Schools) చదువుతున్నారు. కానీ, ప్రైవేట్‌ స్కూళ్ల సంఖ్య 11,407 (28.98%) మాత్రమే. అంటే 28.98% ప్రైవేట్‌ స్కూళ్లలో 59.53% విద్యార్థులున్నారన్న మాట. రాష్ట్రంలో అన్ని రకాల సర్కారు బడులు 24,997 (63%) ఉండగా (Government Schools).. వీటిలో విద్యార్థుల నమోదు 19.3 లక్షలే. ఇది రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల్లో 31.76% మాత్రమే. అంటే 63% ఉన్న సర్కారు బడుల్లో చేరింది 31.76 శాతమే. ఈ ఆందోళనకర విషయాలు పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడయ్యాయి. రాష్ట్రంలో పన్నెండు వందలకుపైగా గురుకులాలుండగా, వీటిల్లో 4.43 లక్షల మంది విద్యార్థులు (7.3%) మాత్రమే చదువుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 1,897 సర్కారు బడుల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్‌ నమోదైంది. ఈ స్కూళ్లలో ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. వీటిలో 32 హైస్కూళ్లు ఉండటం గమనార్హం. రాష్ట్రంలోని 4,325 సర్కారు బడులు పది మంది లోపు విద్యార్థులతో నడుస్తున్నాయి. వీటిలో ప్రాథమిక బడులే అధికంగా ఉన్నాయి.

రాష్ట్రంలో 1,657 ప్రభుత్వ స్కూళ్లుంటే వీటిల్లో 2,11,459 మంది విద్యార్థులున్నారు.
జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ స్కూళ్లు 22,587 ఉండగా, వీటిల్లో విద్యార్థుల సంఖ్య 14,56,609 మాత్రమే.
495 కేజీబీవీలుంటే వీటిల్లో ఇంటర్‌ వరకు 1,32,034 మంది విద్యార్థులన్నారు.
మాడల్‌ స్కూళ్లు 194 ఉంటే, ఇంటర్‌ వరకు 1,07,494 విద్యార్థులు చదువుకుంటున్నారు.
రాష్ట్రంలోని 10,298 (37%) బడుల్లో విద్యార్థుల సంఖ్య 30లోపే ఉన్నది.
మరో 10,066 (36% బడుల్లో విద్యార్థుల నమోదు 30 నుంచి 100 మాత్రమే. అంటే దాదాపు 73% బడుల్లో విద్యార్థుల సంఖ్య 100లోపే ఉన్నది.
101 నుంచి 250 లోపు విద్యార్థులున్న బడులు 4,642 (17%) మాత్రమే ఉన్నాయి.
విద్యార్థుల సంఖ్య 251 నుంచి వెయ్యిలోపు ఉన్న స్కూళ్ల సంఖ్య 2,261 మాత్రమే. అంటే 8% బడుల్లో మాత్రమే వెయ్యిలోపు విద్యార్థులున్నారు.
26 సర్కారు బడుల్లో మాత్రమే వెయ్యికిపైగా విద్యార్థులున్నారు. అంటే 1%లోపు బడుల్లో మాత్రమే వెయ్యి మంది విద్యార్థులున్నారన్న మాట.

పది కంటే తక్కువ మంది విద్యార్థులతో నడుస్తున్న స్కూళ్లు

ఒక్క విద్యార్థీ చేరని సర్కారు స్కూళ్లు  ; 1,897
ఒకే ఒక్క విద్యార్థి ఉన్న స్కూళ్లు ;  55
ఇద్దరే విద్యార్థులున్న స్కూళ్లు ; 151
ముగ్గురే విద్యార్థులున్న స్కూళ్లు ; 193
నలుగురే విద్యార్థులున్న స్కూళ్లు  ; 240
ఐదుగురు విద్యార్థులున్న స్కూళ్లు ; 311
ఆరుగురు విద్యార్థులున్న స్కూళ్లు  ; 299
ఏడుగురు విద్యార్థులున్న స్కూళ్లు  ; 307
ఎనిమిది మంది విద్యార్థులున్న స్కూళ్లు  ; 272
తొమ్మిది మంది విద్యార్థులున్న స్కూళ్లు ; 283
పది మంది విద్యార్థులున్న స్కూళ్లు  ; 317

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • అన్నమయ్య సంకీర్తనలు పులకించిన స‌ప్త‌గిరులు
  • హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ పై క‌విత క‌న్నెర్ర‌
  • కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్ రిలీజ్
  • కోట్లాది కూలీల క‌డుపు కొట్టిన కేంద్రం : షర్మిల
  • క‌మ‌ల్ హాస‌న్ కామెంట్స్ చిన్మ‌యి శ్రీ‌పాద సీరియ‌స్

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes