Ganja Smuggling: గంజాయి స్మగ్మర్లు తెలివి మీరిపోతున్నారు. పోలీసుల కళ్లుగప్పి తమ దందా సాగించుకునేందుకు ఎన్నెన్నో ఎత్తులు వేస్తున్నారు. కానీ ఒక్కోసారి వారి పాచికలు పారడం లేదు. పోలీసులకు అడ్డంగా బుక్కయిపోతున్నారు గంజాయి పెడ్లర్లు. ఒడిశా నుంచి గంజాయి తీసుకు వస్తున్న స్మగ్లర్లును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి.. ఏసీ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. ఏ ఉగ్రవాది కోసమో..లేదా ఏ బాంబు కోసమో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారనుకుంటే పొరపాటే.
Rohit Sharma: సీక్రెట్‌గా కానిచ్చేస్తున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్!
భారీ ఎత్తున గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు.. ఈ ఎసీ బస్సులో తనిఖీలు నిర్వహించారు. వారికి వచ్చిన సమాచారం పక్కా అని నిర్ధారణ అయింది. ఒడిశా నుంచి నాభిన్ నాయక్ అనే వ్యక్తి.. లగేజీ బ్యాగుల మాటున భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్నాడు. దర్జాగా ఏసీ బస్సులో కూర్చుకుని వస్తే ఎవరూ కని పెట్టలేరని నాభిన్ నాయక్ స్కెచ్చేశాడు. కానీ అతని స్కెచ్ కు పోలీసులు చెక్ పెట్టారు. లగేజీ బ్యాగుల్లో నిండా సర్దేసిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ICC Rankings 2025: దుమ్మురేపిన మహ్మద్ సిరాజ్.. అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు!
పోలీసులు గంజాయిని తూకం వేయగా.. దాదాపు 20 కేజీలు ఉన్నట్లు తేలింది. దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ. 11 లక్షలుగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. చక్కగా 4 బ్యాగుల్లో నిందితుడు నాభిన్ నాయక్ గంజాయి తీసుకుని వస్తున్నట్లు తెలిపారు. మరోవైపు నిందితుడు నాభిన్ నాయక్‌ను పోలీసులు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఒడిశాలో ఎక్కడి నుంచి నాభిన్ నాయక్ గంజాయి తీసుకు వస్తున్నాడు. ఎవరి కోసం గంజాయి తీసుకుని వెళ్తున్నాడు. నాభిన్ నాయక్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
