Samantha : సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత గురించి ఏం చెప్పినా క్షణాల్లోనే వైరల్ అయిపోతుంది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లోనూ మెరిసింది. ఇప్పటికీ ఆమెకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఒక్క సినిమా చేస్తే కోట్లలో రెమ్యునరేషన్ వచ్చి పడుతుంది. ఇప్పుడంటే ఇలా ఉన్న సమంత.. మొదట్లో ఏం చేసిందో.. ఆమె మొదటి సంపాదన ఎంతో మాత్రం ఎవరికీ తెలియదు.
Read Also : Payal Gosh : తొమ్మిదేళ్లు శృంగారానికి దూరంగా ఉన్నా.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. తాను పదో తరగతిలో ఉన్నప్పుడు ఓ ప్రోగ్రామ్ కు 8 గంటలు హోస్టింగ్ చేస్తే రూ.500 ఇచ్చారని.. అదే తన మొదటి సంపాదన అని తెలిపింది సమంత. ప్రతిరోజూ సంతోషంగా ఉండాలంటే ఉన్నంతలో పీస్ ఫుల్ గా బతకాలనేది నేర్చుకున్నట్టు చెప్పింది. అలా ప్రతిరోజూ సంతోషంగా ఉంటాను కాబట్టే లైఫ్ లో ఈ స్థాయిదాకా రాగలిగానని స్పష్టం చేసింది సమంత. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ రోజు ఈ స్థాయిదాకా ఎదిగింది.
Read Also : Shriya Reddy : ప్రభాస్ తో షూటింగ్ కు ముందు రోజూ అలా చేశా
