TRIVIKRAM : ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అటు కమెడియన్ గా, నటుడిగా సునీల్ కూడా ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇద్దరూ లైఫ్ లో సూపర్ సక్సెస్ అయ్యారు. ప్రాణ స్నేహితులు అయిన వీరిద్దరూ.. ఒకప్పుడు పంజాగుట్టలో చిన్న రూమ్ లో ఎన్నో కష్టాలు పడుతూ అవకాశాల కోసం వెతుక్కున్నారు. ఒక్కోసారి వీరి దగ్గర తినడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. ఈ విషయాన్ని వారే చాలా సార్లు తెలిపారు. ఓ సారి ఇద్దరి దగ్గర తినడానికి కేవలం రూ.25 మాత్రమే ఉన్నాయంట.
Read Also : Samantha : సమంత మొదటి సంపాదన ఎంతో తెలుసా..?
తర్వాత రోజు ఆ డబ్బులతో తినాలని సునీల్ ప్లాన్ వేసుకున్నాడు. కానీ త్రివిక్రమ్ ఆ డబ్బులు తీసుకెళ్లి కూల్ డ్రింక్ తెచ్చేశాడు. అదేంటి రేపు తినడానికి డబ్బులు ఎలా అని సునీల్ అడిగితే.. అదంతా రేపు చూసుకుందాం. ఈ రోజు అయితే ఈ కూల్ డ్రింక్ తాగు అన్నాడంట. త్రివిక్రమ్ మాటలు విని సునీల్ కు మెంటలెక్కేసింది. ఇంత కూల్ గా ఎలా ఆలోచిస్తాడు అని అప్పటి నుంచే త్రివిక్రమ్ ను ఫాలో అవడం సునీల్ స్టార్ట్ చేశాడు. ఏ విషయానికీ భయడపకుండా ఉండటమే మనిషి మొదటి సక్సెస్ అని త్రివిక్రమ్ పదే పదే చెబుతుంటారు. అదే నేడు ఆయన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందేమో అని ఆయన ఫ్యాన్స్అ నుకుంటారు.
Read Also : Shriya Reddy : ప్రభాస్ తో షూటింగ్ కు ముందు రోజూ అలా చేశా
