US-Pakistan: ఉగ్రవాద దేశానికి అమెరికా మద్దతు తెలుపుతోంది. యూఎస్ పాకిస్తాన్ సంబంధాలు నానాటికి బలపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశ ప్రయోజనాల కన్నా, సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీ, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం పాకిస్తాన్‌తో జతకట్టి భారత వ్యతిరేక పనుల్ని చేస్తున్నాడు. అతి తక్కువ ధరలకే రేర్ ఎర్త్ మినరల్స్‌ని పాకిస్తాన్ యూఎస్‌కు సరఫరా చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. దీని తర్వాత అమెరికా పాకిస్తాన్‌ల మధ్య అత్యాధునిక మిస్సైళ్లను ఇచ్చే భారీ మిలిటరీ డీల్ కుదిరింది. ఇటీవల, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లను వైట్ హౌజ్‌లో కలిశాడు. ఆ తర్వాతే ఈ మిలిటరీ డీల్ గురించి తెలిసింది.
ముఖ్యంగా, అమెరికా పాకిస్తాన్‌కు అడ్వాన్స్‌డ్ మీడియం-రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను (AMRAAM) అందిస్తోంది. ఇవి భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అవకాశం ఉంది. ఈ క్షిపణి సాయంతో పాకిస్తాన్ 2019లో భారతీయ MiG-21 ఫైటర్ జెట్‌ను కూల్చింది. అమెరికా రక్షణ శాఖ ఇటీవల 35 దేశాలతో కూడిన పెద్ద రక్షణ ఒప్పందం వివరాలను విడుదల చేసింది. ఈ ఒప్పందం ప్రకారం, ప్రముఖ అమెరికన్ రక్షణ సంస్థ రేథియాన్ AIM-120C8, AIM-120D3 క్షిపణులను తయారు చేసే బాధ్యతను చేపట్టింది. మొత్తం ఈ ఒప్పందం విలువ 2.5 బిలియన్ డాలర్ల వరకు ఉంది. ఈ ప్రాజెక్టు మే 30, 2030 వరకు పూర్తవుతుంది.
అయితే, ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్ ఎన్ని క్షిపణుల్ని అందుకుంటుందో తెలియదు. అయితే, ఈ AMRAAM క్షిపణులు ఎఫ్-16 ఫైటర్ జెట్లకు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వద్ద ఉన్న ఈ ఫైటర్ జెట్లను అమెరికా అప్‌గ్రేడ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
Read Also: AR Rahman: ‘అబ్బి అబ్బి..’ సంచలనం.. రెహమాన్ ను నమ్మొచ్చా?
AIM-120 AMRAAM అంటే ఏమిటి..?
AIM-120 AMRAAM అనే క్షిపణులు ‘‘ఫైర్ అండ్ ఫర్గాట్’’ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది ఆధునిక ఎయిర్ టూ ఎయిర్ మిస్సైల్. దీనిని ఒక్కసారి ఫైటర్ జెట్ నుంచి ప్రయోగిస్తే, ఆ తర్వాత తనంతట తానే సొంత యాక్టివ్ రాడార్ సీకర్ ద్వారా లక్ష్యాలను సొంతగా ట్రాక్ చేసి నాశనం చేస్తుంది.
ఈ క్షిపణి ఎక్స్ పోర్ట్ వెర్షన్ అయిన AIM-120C-8, ఎలక్ట్రానిక్ కౌంటర్‌మెజర్స్ (ECM) కు మెరుగైన నిరోధకత, మెరుగైన గైడెన్స్ సిస్టమ్స్, లాంగ్ రేంజ్ కలిగి ఉంటుంది. దీనిని ఎఫ్-16, యూరో ఫైటర్ టైఫూన్, ఎఫ్-22 రాప్టర్, ఎఫ్-35 వంటి యుద్ధవిమానాలతో అనుసంధానించవచ్చు.
తాజా ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్‌తో పాటు యూకే, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్‌లకు అమెరికా భారీగా ఆయుధాలను సరఫరా చేయనుంది. ఈ క్షిపణిని కొనుగోలు చేసే 35 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది.
