Kanpur Blast: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని మర్కజ్ మసీదు సమీపంలో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక వివరాల ప్రకారం, మూల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిశ్రీ బజార్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. నగరంలో పేలుళ్ల కారణంగా ఒక్కసారిగా ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. పేలుళ్ల దాడికి ఇళ్లు, సమీపంలోని దుకాణాల గోడలు పగిలిపోయాయి. పార్క్ చేసి ఉన్న రెండు స్కూటర్లలో ఈ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్ల కారణంగా ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు.
Read Also: Ileana : శృంగారం మంచి వ్యాయామం లాంటిది.. స్టార్ హీరోయిన్ కామెంట్స్
పేలుళ్ల శబ్ధం 500 మీటర్ల వరకు వినిపించింది. పోలీసులు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, పేలుడుకు గల కారణాలను పరిశీలిస్తున్నారు. బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పేలుడు సభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడిన వారిని పోలీసులు ఉర్సులా ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన ప్రమాదమా లేదా కుట్రనా.? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. పూర్తి విచారణ తర్వాతే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని జాయింట్ పోలీస్ కమిషనర్ అశుతోష్ కుమార్ చెప్పారు.
#WATCH | Kanpur, Uttar Pradesh: Joint Police Commissioner (Law and Order) Ashutosh Kumar says, “In the Mishri Bazaar area under the Mulganj police station, two scooters were parked today in which a blast occurred. This incident took place around 7:15 PM… A total of 6 people are… pic.twitter.com/ES52kcWBxK
— ANI (@ANI) October 8, 2025
