Jubilee Hills By Election: తెలంగాణలో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న జూబ్లీహల్స్ ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటన ఎప్పుడు అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ బరిలో దిగే అభ్యర్థి పేరును ప్రకటించింది కాంగ్రెస్.. పార్టీ నేత నవీన్ యాదవ్ పేరును అధికారికంగా ప్రకటించింది ఏఐసీసీ.. బీసీలకు ప్రాధాన్యత ఇస్తామంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ.. జూబ్లీహిల్స్‌లోనూ బీసీ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కే అవకాశం ఇచ్చింది.. ఇక, నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనున్న విషయం విదితమే.. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి.. ఇప్పుడు టికెట్ దక్కించుకున్నారు.. ఇక, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే మాగంతి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దింపారు కేసీఆర్.. మరోవైపు.. ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఇప్పటికే ఎంఐఎం, టీడీపీ ప్రకటించగా.. బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది..
Read Also: US-Pakistan: భారత్‌కు ఆందోళన.. పాకిస్తాన్‌కు అమెరికా AMRAAM క్షిపణులు.. వీటి ప్రత్యేకత ఇదే..
