INDW vs SAW: మహిళల వన్డే ప్రపంచకప్‌లో వరుసగా రెండు విజయాలతో భారత్ జోరు మీదుంది. ఇక, మూడో విజయంపై కన్నేసింది. ఈరోజు ( అక్టోబర్ 9న) విశాఖపట్నంలోని వీసీఏ-వీడీసీఏ స్టేడియంలో హర్మన్‌ప్రీత్‌సేన.. సౌతాఫ్రికాను ఢీ కొనబోతుంది. ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడాక, గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన సఫారీ జట్టు.. ఆల్‌రౌండ్ బలంతో కనిపిస్తుంది. కానీ, ఓటమే ఎరుగని విశాఖలో మ్యాచ్ జరుగుతుండడం, జట్టు మంచి ఫామ్‌లో ఉండడంతో టీమిండియాకు హ్యాట్రిక్ గెలుపు మరీ కష్టమేమీ కాకపోవచ్చు.
Read Also: YS Jagan: నేడు ఉమ్మడి విశాఖ జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన.. అప్రమత్తమైన పోలీసులు
అయితే, తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినప్పటికీ.. బ్యాటింగ్‌లో తడబాటు భారత్‌కు కాస్త ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తీవ్రంగా నిరాశపరిచారు. మిగతా బ్యాటర్లు సమయోచితంగా రాణిస్తుండటంతో ఆ మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచింది. కానీ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఈ ఇద్దరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి.. ఎందుకంటే, ఆ తర్వాతి మ్యాచ్ ఆస్ట్రేలియాతో కాబట్టి బ్యాటింగ్ విభాగం మొత్తం సమష్టిగా సత్తా చాటితే మంచిది. ప్రతీక రావల్ భారీ స్కోర్లు చేయకపోయినా.. జట్టుకు కావాల్సిన స్కోర్ మాత్రం అందిస్తుంది. హర్లీన్ డియోల్ సైతం నిలకడగా రాణిస్తోంది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, మిడిలార్డర్లో దీప్తి శర్మ కీలంగా మారింది. గత మ్యాచ్‌లో రిచా ఘోష్ టీమిండియాను ఆదుకుంది. హెల్త్ ఇష్యూతో గత మ్యాచ్‌కు దూరమైన ఆల్‌రౌండర్ అమన్‌జ్యోత్ నేడు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఆమె కోసం రేణుక సింగ్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. యువ ఫాస్ట్‌బౌలర్ క్రాంతి గౌడ్ సూపర్ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఆమె జట్టుకు అదిరే పోయే ఆరంభాలందిస్తోంది. స్పిన్నర్లు దీప్తి, స్నేహ్ రాణా, శ్రీ చరణి మంచి ప్రదర్శన చేస్తుండగా.. విశాఖపట్నం పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి వీరు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.
Read Also: Shiva Rajkumar: విజయ్ ఏదైనా అడుగు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.. నటుడు శివరాజ్ సంచలన వ్యాఖ్యలు!
కాగా, ఈ వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా భారత్ కి సమతూకంతో కనిపిస్తుంది. ఆరంభ పోరులో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ.. కివీస్ పై తన అసలు ఆటను బయటికి తీసింది సఫారీ జట్టు. 232 రన్స్ టార్గెట్ ను 9 ఓవర్లకు పైగా మిగిలుండగానే ఛేదించేసింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ తజ్మిత్ బ్రిట్స్ ఆ మ్యాచ్‌లో శతకం బాదింది. సునె లుజ్ 83 నాటౌట్ కొట్టింది. వీరికి తోడు కెప్టెన్ లారా వోల్వార్ట్, మరిజేన్ కాప్, అనెకె బోష్, క్లో ట్రైయాన్‌లతో సఫారీ జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో ఆరంభ ఓవర్లలో కాప్‌ను ఎదుర్కోవడం టీమిండియా బ్యాటర్లకు పెద్ద సవాలే అని చెప్పుకొచ్చారు. స్పిన్నర్ ఎంలబాతోనూ పెను ముప్పు పొంచి ఉంది. ఇంకా ట్రైయాన్, క్లాస్, ఖకాలతో దక్షిణాఫ్రికా బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది.
Read Also: PAK vs AUS: 28 సంవత్సరాలుగా పోరాటం.. పాకిస్థాన్ మహిళలతో కావట్లేదమ్మా! ఇక ఇంటికే
తుది జట్లు (అంచనా)..
టీమిండియా: స్మృతి మంధాన, ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్‌జ్యోత్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.
దక్షిణాఫ్రికా: లారా వోల్వార్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, సునె లుజ్, మరిజేన్ కాప్, అనెకె బోష్, జాఫ్టా, క్లో ట్రైయాన్, డిక్లెర్క్, ఎంలబా, ఖకా, క్లాస్.
