Captain Tilak Varma: తిలక్ వర్మ.. గత కొన్ని రోజులుగా ఈ పేరు మార్మోగిపోయింది. ముఖ్యంగా తాజాగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో పాకిస్తాన్ బౌలింగ్ ను అద్భుతంగా ఎదుర్కొని టీమిండియాని మరోసారి విజేతగా నిలిపాడు మన తెలుగు కుర్రాడు. దీంతో ఒక్కసారిగా తిలక్ హీరోగా మారిపోయాడు. అయితే, ఇప్పుడు అతడు మరోసారి కొత్త బాధ్యతలను చేపట్టబోతున్నాడు. అవును, రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పోటీ పడే హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఢిల్లీతో ఈ నెల 15వ తేదీన ఆరంభమయ్యే మ్యాచ్ కోసం హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ బుధవారం 15 మందితో సభ్యుల కూడిన జట్టును ప్రకటించింది. అందులో తిలక్ వర్మను కెప్టెన్‌గా, రాహుల్ సింగ్ ను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
Read Also: INDW vs SAW: నేడు భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య కీలక పోరు.. ముచ్చటగా మూడోసారి గెలిచేనా..!
కాగా, ఇటీవలే టీమిండియా A జట్టులో తన ఫామ్ ను కంటిన్యూ చేసాడు తిలక్ వర్మ. దీంతో ఇప్పటి వరకు ప్లేయర్ గా అదరగొట్టిన తిలక్ కెప్టెన్‌గా ఏ మేరకు రాణిస్తాడో అనేది వేచి చూడాలి.  హైదరాబాద్ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), సీవీ మిలింద్, తన్మయ్, అభిరత్ రెడ్డి, హిమతేజ, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, నిశాంత్, అనికేత్ రెడ్డి, కార్తికేయ, అలీ కాచి డైమండ్, రాహుల్ రాదేశ్.
