బాలీవుడ్‌లో స్నేహాలు, బంధుప్రీతి ఎంత వరకు వాస్తవం? అనే విషయంపై తాజాగా.. అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ధర్మ ప్రొడక్షన్స్ అధినేతగా ఆయన అనుభవంతో ఎలాంటి బంధాలైన ఇండస్ట్రీలో  డబ్బు, అవకాశాల కోసం మాత్రమే అవుతాయని చెప్పారు. అలాగే ఆయన, కొందరు నట వారసులను ప్రోత్సహించడం కంటే, గ్రూపుల మీద ఆధారపడి స్నేహాన్ని చూపించడం జరుగుతుందని చెప్పారు.
Also Read : Bakasura Restaurant : 250 మిలియన్ల మైలురాయిని చేరుకున్న.. ‘బకాసుర్ రెస్టారెంట్’
అలాగే ‘నటులు ఎప్పుడూ నిర్మాతలతో నష్టాలను పంచుకునేందుకు ఆసక్తి చూపరు. ప్రధానంగా డబ్బు, పారితోషికాల విషయంలో మాత్రమే వారు ఆసక్తి చూపుతారు. నా గత రెండు సినిమాలు సరిగా ఆడలేదు, ‘మీ డబ్బును తిరిగి ఇస్తా’ అని ఏ నటుడు చెప్పలేదు. ఎవరూ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు, కానీ కావల్సినంత తీసుకుంటారు.  నా జీవితంలో స్నేహితులు ఎప్పుడూ సహాయం చేయలేదు . అందరూ వ్యాపారం కోసం మాత్రమే ఉంటారు. నేను కూడా వ్యాపారం కోసం ఇక్కడ ఉన్నాను, దాతృత్వం కోసం కాదు!” అని చెప్పారు. ఆయన మాటల ద్వారా తెలిసింది ఏంటీ అంటే – పరిశ్రమలో ప్రతి సన్నివేశం వెనుక వ్యాపారం, వ్యూహాలు ఉంటాయి, వ్యక్తిగత స్నేహం చాలా అరుదుగా ఉంటుందని తెలిపారు.
