Israel Hamas Peace Deal: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాజాగా ట్రంప్ ఫాక్స్ న్యూస్ హోస్ట్ సీన్ హన్నిటీకి ఇచ్చిన ఫోన్ కాల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన నెతన్యాహుతో తన సంభాషణను గుర్తు చేసుకున్నారు. బందీల విడుదల, గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన తర్వాత అందరూ “ఇజ్రాయెల్‌ను మళ్ళీ ప్రేమిస్తున్నారని” ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తనతో అన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. “ఈ ఒప్పందం మొత్తం ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చింది” అని ట్రంప్ చెప్పారు.
READ ALSO: Tejashwi Yadav: ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా.. తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన
ఇంటర్వ్యూలో ట్రంప్ ఏం చెప్పారంటే..
గాజా ఒప్పందం ప్రకటించిన తర్వాత ‘బీబీ’ (నెతన్యాహు ముద్దుపేరు) తనతో మాట్లాడినట్లు ట్రంప్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒప్పందం తర్వాత ప్రపంచ దేశాలు తనను ఇష్టపడుతున్నారు, ఇది తాను నమ్మలేకపోతున్నాను నెతన్యాహు చెప్పినట్లు పేర్కొన్నారు. వాళ్లు మరీ ముఖ్యంగా మళ్లీ ఇజ్రాయెల్‌ను ప్రేమిస్తున్నారని ఆయన తనతో పంచుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ఇజ్రాయెల్‌కు అన్నీ కలిసి వచ్చిన విధానం అద్భుతంగా ఉందని తాను నెతన్యాహుతో చెప్పానని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. తాజా పరిణామాలు కేవలం కొన్ని పరిస్థితుల ప్రభావం అని చెప్పారు. ఉదాహరణకు ఇరాన్ అణు సామర్థ్యాన్ని, అణుశక్తిని బయటకు తీయడం వంటి, చాలా విభిన్నమైన విషయాలు జరిగాయని ఆయన చెప్పారు. ఇందులో ఎంతో మంది ప్రతిభ ఉంది, అలాగే కొంతవరకు అదృష్టం కూడా కలిసి వచ్చిందన్నారు. గాజా యుద్ధం ముగింపు విషయంలో ట్రంప్ ప్రధాన ప్రపంచ దేశాలకు క్రెడిట్ ఇచ్చేలా మాట్లాడారు.
అలాగే ఆయన తన పరిపాలన సభ్యులు ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందాన్ని అమలులోకి తీసుకురావడంలో చేసిన సహాయాన్ని పేర్కొన్నారు. “…స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్, మార్కో [రుబియో] నుంచి, JD [వాన్స్] మొత్తం అమెరికా పరిపాలనా సమూహం అంతా అద్భుతంగా పని చేసిందని కొనియాడారు. ఈ ఒప్పందాన్ని ఖరారు చేయడంలో అరబ్ దేశాలతో కూడా ఆయన క్రెడిట్ ఇచ్చారు. నిజాయితీగా చెప్పాలంటే ఈ ఒప్పందం కుదరడంలో ప్రపంచం మొత్తం కలిసి వచ్చిందని అన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందం
ఇజ్రాయెల్ – హమాస్ మధ్య జరుగుతున్న పోరులో ఇప్పటి వరకు సుమారుగా 67 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈక్రమంలో ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఈనేపథ్యంలో గాజాలో యుద్ధాన్ని ముగించాలనే ట్రంప్ ప్రణాళికలో మొదటి దశ అయిన కాల్పుల విరమణ, బందీ ఒప్పందానికి అంగీకరించామని ఇజ్రాయెల్, హమాస్ తెలిపాయి. గాజాపై ఇజ్రాయెల్ విధ్వంసకర దాడికి కారణమైన హమాస్ ఉగ్రవాదుల సరిహద్దు దాడికి రెండు సంవత్సరాల ఒక రోజు తర్వాత, ఈజిప్టులో జరిగిన పరోక్ష చర్చలు పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లో శాంతిని నెలకొల్పడానికి ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందానికి ఇజ్రాయెల్- హమాస్ రెండు కూడా అంగీకారానికి వచ్చాయి.
ఈ ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే అమెరికా అధ్యక్షుడికి ఒక ముఖ్యమైన విదేశాంగ విధాన విజయాన్ని సాధించినట్లు అవుతుంది. ఆయన ప్రధాన ప్రపంచ సంఘర్షణలకు శాంతిని తీసుకురావాలని ప్రచారం చేశారు, కానీ గాజాలో, రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో శాంతిని తీసుకురావడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
READ ALSO: Allu Arjun : బన్నీ చేసిన పనికి రూ.40 కోట్లు నష్టపోయిన అరవింద్..
