బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో కీలక విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్ రెడ్డి హాజరై, హైకోర్టుకు ప్రభుత్వ నిర్ణయాలను వివరించారు. ఏజీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర కేబినెట్ బీసీ జనగణన నిర్వహించాలనే నిర్ణయం తీసుకుందని తెలిపారు. సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 57.6 శాతం ఉందని ఆయన పేర్కొన్నారు.
Bigg Boss 9 : డిప్యూటీ సీఎం చొరవతో తెరుచుకున్న బిగ్ బాస్..
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు ఏజీ తెలిపారు. ఈ తీర్మానం సామాజిక న్యాయం దిశగా ముఖ్యమైన అడుగని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపకపోయినా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది చట్టబద్ధమైనదే అని ఏజీ పేర్కొన్నారు. “రాష్ట్రపతి ఆమోదం లేని స్థితిలో కూడా బిల్లు చెల్లుబాటు అవుతుంది” అని వివరించారు. గవర్నర్ నిర్దిష్ట గడువులో ఆమోదం తెలపకపోతే చట్టంగా పరిగణించాల్సి ఉంటుందని, దీనికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ అవసరం లేదని ఏజీ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
Immigrants: 28 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్.. అక్రమంగా దేశంలోకి
