Rohith Sharma: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన ఆటోమొబైల్ రంగంపై ఉన్న అభిరుచిని చాటుకున్నాడు. తాజాగా రోహిత్ సరికొత్త టెస్లా మోడల్ Y (Tesla Model Y) కారును కొనుగోలు చేశాడు. భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ వాహనం లాంచ్ అయిన తర్వాత సొంతం చేసుకున్న తొలి వ్యక్తుల్లో రోహిత్ శర్మ కూడా ఒకరు. ఆటోమొబైల్ ప్రియుడిగా పేరుగాంచిన రోహిత్, ఇటీవలే లాంబోర్ఘిని ఊరస్ SE (Lamborghini Urus SE) కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
BC Reservation : హైకోర్టులో షాకింగ్ వాదనలు.. రాష్ట్రపతి ఆమోదం లేకపోయినా రిజర్వేషన్లు చట్టబద్ధమే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, రోహిత్ శర్మ తన టెస్లా మోడల్ Y కోసం క్విక్ సిల్వర్ (Quick Silver) కలర్‌ను ఎంచుకున్నారు. అయితే ఈ మోడల్ డైమండ్ బ్లాక్, పర్ల్ వైట్ మల్టీ కోట్, అల్ట్రా రెడ్, దీప్ బ్లూ మెటాలిక్, స్టెల్త్ గ్రే వంటి కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో టెస్లా మోడల్ Y రూ.59.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది. ఇందులో హై ఎండ్ రేంజ్ వెర్షన్ ధర రూ.67.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ వాహనం రియర్ వీల్ డ్రైవ్ (RWD) కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. ఇందులో ఉన్న సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ 299 hp పవర్, 420 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 60.5 kw అవర్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ వెర్షన్ ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గంట వేగం చేరుతుంది. దీని గరిష్ట వేగం 201 కిమీ/గం.
Jio సంచలనం.. కేవలం రూ.799కే JioBharat safety first 4G ఫీచర్ ఫోన్ లాంచ్..
అదేవిధంగా, లాంగ్ రేంజ్ RWD వెర్షన్ 75 KW అవర్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 622 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ వెర్షన్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ 340 hp పవర్, 450 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని కేవలం 5.6 సెకన్లలో చేరుతుంది. అలాగే ఈ కారు గరిష్ట వేగం మాత్రం 201 కిమీ/గం. ఇక రోహిత్ కొన్న కారుకు రిజిస్ట్రేషన్ నంబర్ “3015”. ఇది ఆయన పిల్లల పుట్టిన తేదీలను తెలుపుతుంది. (కూతురు: డిసెంబర్ 30, కొడుకు: నవంబర్ 15).
Rohit Sharma has bought a new Tesla electric car, and just like his previous car, he has chosen its number based on his children’s birth dates.
3015 pic.twitter.com/TqBAIA4RKq
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 7, 2025
