టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సతీమణి ఆర్తి అహ్లావత్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌తో ఆర్తి డేటింగ్ (సహజీవనం) చేస్తున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరు చనువుగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. డేటింగ్ విషయం తెలిసే సెహ్వాగ్ తన సతీమణి ఆర్తికి కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడట. ఆర్తికి సెహ్వాగ్ విడాకులు ఇచ్చేందుకు సిద్దమయ్యాడని, డివోర్స్ అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది.
వీరేంద్ర సెహ్వాగ్, మిథున్ మన్హాస్ ఇద్దరు ఢిల్లీకి చెందిన వారే. ఇద్దరు మంచి స్నేహితులు కూడా. సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడగా.. మిథున్ ఢిల్లీకి సుదీర్ఘ కాలం రంజీ క్రికెట్ ఆడాడు. సెహ్వాగ్ స్నేహితుడు కావడంతో ఆర్తి అహ్లావత్‌తో మిథున్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు పలు వివేదికలు పేర్కొన్నాయి. సహజీవనం విషయం తెలిసే కొంతకాలంగా ఆర్తి, సెహ్వాగ్ దూరంగా ఉంటున్నారట. ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. గత దీపావళి సందర్భంగా వీరూ పోస్ట్ చేసిన ఫొటోలో ఆర్తి లేకపోవడం గమనార్హం. 2023 నుంచే ఆర్తిని సెహ్వాగ్ దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఆర్తికి విడాకులు ఇచ్చేందుకు సెహ్వాగ్ సిద్దమయ్యాడట. ప్రస్తుతం విడాకుల అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు సమాచారం.
Also Read: Shubman Gill: రోహిత్ కెప్టెన్సీకి ఎండ్ కార్డు పడుతుందని ముందే తెలుసు.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్ వివాహం 2004లో జరిగింది. ఆ సమయంలో ‘సెహ్వాగ్‌ను క్లీన్ బోల్డ్ చేసిన ఆర్తి’ అని అందరూ మాట్లాడుకున్నారు. వీరికి ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఢిల్లీ తరఫున జూనియర్ క్రికెట్ ఆడుతున్నారు. మరోవైపు మిథున్ మన్హాస్ ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రోజర్ బిన్ని స్థానంలో అతడు బీసీసీఐ పగ్గాలు అందుకున్నారు. సరిగ్గా కొత్త బాధ్యతలు చేపట్టే సమయంలో మిథున్‌పై ఈ రూమర్స్ రావడం విశేషం. ఇంతవరకు ఈ వార్తలపై ఎవరూ స్పందించలేదు. బాధ్యతగల పోస్టులో ఉన్న మిథున్ అయినా స్పందింస్తారేమో చూడాలి.
