STU: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (STU) అధ్యక్షుడు, FAPTO చైర్మన్ సాయి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఉపాధ్యాయులు ఇకపై బోధనేతర (Non-Teaching) పనుల్లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. హాజరు యాప్, మధ్యాహ్న భోజనం యాప్ మినహా మిగిలిన అన్ని యాప్‌లను బహిష్కరించాలని తీర్మానించినట్లు తెలిపారు. అదేవిధంగా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన “విద్యాశక్తి” కార్యక్రమాన్ని కూడా బహిష్కరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో అన్ని జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు, కలెక్టర్లు, రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు మెమొరాండం సమర్పించినట్లు సాయి శ్రీనివాస్ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం గమనించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ 2025 నియామకాల విషయంలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నియామకాలు వెబ్ ఆప్షన్ల ద్వారా కాకుండా మ్యానువల్ విధానంలో జరగాలని STU డిమాండ్ చేసింది. గతంలో ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలను చట్టబద్ధంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి జూన్ నెలలో పూర్తి చేసినప్పటికీ.. వేలాది మంది ఉపాధ్యాయులు ఇప్పటికీ రిలీవర్ లేక పాత పాఠశాలల్లోనే కొనసాగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Rohith Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ కార్ల కలెక్షన్ లోకి కొత్త Tesla Model Y..
బదిలీ పొందిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయడానికి పాఠశాల విద్యాశాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. డీఎస్సీ నియామకాల సమయంలో రిలీవర్ లేని పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదని ఆయన గుర్తుచేశారు. ఖాళీలు భర్తీ కాకపోతే అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం ద్వారా ఆ పోస్టులను భర్తీ చేసి, బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని సాయి శ్రీనివాస్ పేర్కొన్నారు.
అదేవిధంగా, రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన 9620 మోడల్ ప్రైమరీ పాఠశాలలలో ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే ప్రభుత్వ లక్ష్యం అమలు కావడంలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం చాలా మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో కేవలం ఇద్దరు లేదా ముగ్గురు ఉపాధ్యాయులే పని చేస్తున్నారని వివరించారు. అలాగే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో హైస్కూల్ ప్లస్ పాఠశాలలకు మంజూరు చేసిన 1752 పోస్టుల్లో దాదాపు 950 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు.
Rohith Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ కార్ల కలెక్షన్ లోకి కొత్త Tesla Model Y..
