ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంతి కిషోర్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 51 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. 16 శాతం ముస్లింలకు కేటాయించగా.. 17 శాతం అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినవారికి కేటాయించారు. జాబితాలో తరతరాలుగా పాఠ్యపుస్తకాలు రాసిన గణిత శాస్త్రజ్ఞుడు అన్నాడు. అలాగే మాజీ అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, వైద్యులు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో 48 శాతం ఓట్లు తమకు లభిస్తాయని ప్రశాంత్ కిషోర్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో రెండు కూటములు 72 శాతం ఓటర్లను మాత్రమే సాధించాయని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా.. తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన
ఇక అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి అవినీతి లేనివారిని ఎంపిక చేసినట్లుగా ప్రశాంత్ కిషోర్ తెలిపారు. క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలనే అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు చెప్పుకొచ్చారు. అభ్యర్థుల్లో ఒక ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు ఉన్నాడని తెలిపారు. కుమ్రార్‌లో నిలబెట్టిన అభ్యర్థి కేసీ. సిన్హా.. పాట్నా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. ఆయన రచించిన పుస్తకాలు దశాబ్దాలుగా బీహార్, అనేక ఇతర రాష్ట్రాలలోని పాఠశాలల్లో పొందిపరిచారు.
ఇది కూడా చదవండి: Virender Sehwag Wife: షాకింగ్.. బీసీసీఐ అధ్యక్షుడితో సెహ్వాగ్ సతీమణి డేటింగ్?
మాంఝీ నుంచి వైబీ.గిరిని నిలబెట్టారు. ఈయన పాట్నా హైకోర్టులో సీనియర్ న్యాయవాది. హై ప్రొఫైల్ కేసుల్లో కీలక పాత్ర పోషించారు. బీహార్ అదనపు అడ్వకేట్ జనరల్‌గా, పాట్నా హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ కేసులకు భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా పని చేశారు.
ఇక ముజఫర్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ అమిత్ కుమార్ దాస్.. పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పూర్వ విద్యార్థి. గ్రామీణ ప్రాంతాలకు అవగాహన కల్పించడానికి.. ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను విస్తరించడానికి విశేష కృషి చేశారు. ఆయన భార్య కూడా డాక్టర్. ముజఫర్‌పూర్‌లో ఒక ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు.
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 14న జరగనుంది. ఓ వైపు ఎన్డీఏ-ఇండియా కూటమిలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తుండగా.. ఇంకోవైపు ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల అరంగ్రేటంతో పోరాడుతున్నారు. అయితే ఈసారి ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.
