నార్త్ కరోలినాలో దారుణం చోటుచేసుకుంది. ఓ పేషెంట్ తన రక్తాన్ని.. ఆస్పత్రిలో ఉన్న సిబ్బందిపై, ఇతర పేషెంట్లపై చల్లాడు. మరికొందరి కళ్లల్లో చల్లాడనే ఆరోపణలతో.. దాదాపు ఆరు నెలల తర్వాత అతడు అరెస్ట్ అయ్యాడు. నిందితుడిని రెండు అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Scooter on Fire Outside Showroom: ఏంటీ సుధా వీడు.. బైక్ పని చేయకపోతే తగలెట్టేస్తాడా…
మార్చి 21న నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలోని REX ఆసుపత్రిలో 25 ఏళ్ల కెమెరాన్ గిల్‌క్రిస్ట్ చికిత్స పొందుతున్నప్పుడు తన చేతి నుండి IV హుక్‌ను విప్పి.. ఇద్దరు ఆసుపత్రి సిబ్బందిపై HIV-పాజిటివ్ రక్తాన్ని చిమ్మాడని సిబ్బంది ఆరోపించారు. సెప్టెంబర్ 11న రెండు అభియోగాలపై అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. వైద్య సిబ్బంది తమ విధులు నిర్వహిస్తున్నపుడు.. ” గిల్‌క్రిస్ట్ తన చేతి నుండి IVని చించి, “బాధితుడి కళ్ళలో HIV రక్తాన్ని స్ప్రే” చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. కానీ ఆ HIV పాజిటివ్ రక్తం గిల్‌క్రిస్ట్‌కు చెందిందా లేదా ఇద్దరు సిబ్బందికి ఆ తర్వాత HIV సోకిందా అనేది విషయం తెలియాల్సి ఉంది.
Read Also:Suicide:ఇద్దరు పిల్లలకి విషమిచ్చి.. ఆపై ఆపై ఆత్మహత్య చేసుకున్న తండ్రి
సంఘటన జరిగిన సమయంలో గిల్‌క్రిస్ట్ వైద్య, మానసిక చికిత్స పొందుతున్నందున అతనిపై కేసు నమోదు చేయడానికి ఇంత సమయం పట్టిందని రాలీ పోలీసులు స్పష్టం చేశారు. మార్చి 30న ఈ ఘటనజరగ్గా నిందితుడు పారిపోయాడు . అప్పటి నుంచి అతన్ని వెతుకుతున్న పోలీసులు.. అక్టోబర్ 7న అరెస్టు చేశారు. ఆసుపత్రి భద్రతను పెంచడానికి మరియు దాని సిబ్బందిపై హింసకు సంబంధించిన కేసుల్లో అభియోగాలను కొనసాగించడానికి చట్ట అమలు సంస్థలు అదనపు భద్రతా బృందాలతో కలిసి పనిచేస్తోందని UNC హెల్త్ రెక్స్ ప్రతినిధి అన్నారు.
