2025 Nobel Prize Literature: నోబెల్ పురస్కారాల విజేతల పేర్లను కమిటీ ప్రకటిస్తుంది. తాజాగా గురువారం సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న విజేత పేరును నోబెల్ కమిటి వెల్లడించింది. హంగేరియన్ రచయిత క్రాస్జ్నా హోర్కెకి సాహిత్యంలో నోబెల్ అవార్డ్ వరించింది. క్రాస్జ్నా హోర్కె మధ్య యూరోపియన్ సంప్రదాయంలో ఒక గొప్ప ఇతిహాస రచయితగా ప్రత్యేకతను సంతరించుకున్నారు.
READ ALSO: Rinku Singh: రింకు సింగ్‌కు డి-కంపెనీ బెదిరింపులు.. 10 కోట్లు డిమాండ్!
1954లో ఆగ్నేయ హంగేరీలోని గ్యులా అనే చిన్న పట్టణంలో క్రాస్జ్నాహోర్కై జన్మించారు. ఆయన రొమేనియన్ సరిహద్దుకు సమీపంలో జన్మించారు. ఆయన మొట్టమొదటి నవల 1985లో ప్రచురించారు. దాని పేరు ‘సాటంటాంగో’. ఈ రచన హంగేరీలో సాహిత్య సంచలనం సృష్టించింది. తర్వాత ఆయన రాసిన ‘హెర్ష్ట్ 07769’ జర్మన్ దేశంలోని సామాజిక అశాంతిని చిత్రీకరించింది. ఈ రచనను గొప్ప సమకాలీన జర్మన్ నవలగా పాఠకులు అభివర్ణించారు. అపోకలిప్టిక్ భయానక పరిస్థితుల మధ్య, కళ శక్తిని పునరుద్ఘాటించే ఆయన దార్శనిక కృషికి తాజా నోబెల్ బహుమతి ఆయనను వరించింది. ఈ బహుమతిని స్వీడిష్ అకాడమీ ప్రదానం చేస్తుంది. దీని విలువ 11 మిలియన్ కిరీటాలు ($1.2 మిలియన్లు).
గత ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ గెలుచుకున్నారు. 2025లో ఇప్పటి వరకు వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాలలో నోబెల్‌లు ప్రకటించారు. తాజాగా ప్రకటించిన సాహిత్యంలో నోబెల్ బహుమతితో ఈ వారంలో ప్రకటించిన నోబెల్ బహుమతులు నాలుగుకు చేరుకున్నాయి.
READ ALSO: Ratan Tata Dreams: రతన్ టాటా నెరవేరని కలల గురించి తెలుసా!
