Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడలో జరిగిన బహిరంగ సభలో మత్స్యకారుల సమస్యలపై స్పందిస్తూ వారికి అండగా ఉంటానని తెలిపారు. పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం కారణంగా మత్స్యకారులు పడుతున్న తీవ్ర ఇబ్బందులపై ఆయన చర్చించారు. 7193 కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని, వారి ప్రతి కష్టంలో తాను తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. దివిస్, అరబిందో వంటి కంపెనీల నుంచి కాలుష్యం వస్తుందని మత్స్యకారులు చెప్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అమీనాబాద్ హార్బర్ డిజైన్ లోపం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనే అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Rinku Singh: రింకు సింగ్కు డి-కంపెనీ బెదిరింపులు.. 10 కోట్లు డిమాండ్!
పరిశ్రమలు తప్పనిసరి అయిపోయాయని వ్యాఖ్యానిస్తూనే, పరిశ్రమలుకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే, పరిశ్రమల్లో తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకునేలా తప్పనిసరిగా చేస్తామని, ముఖ్యంగా వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదిలేయడం ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. ఈ కంపెనీలను 2005లో వైఎస్ తీసుకువచ్చారని గుర్తు చేశారు. కాలుష్య సమస్యను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, మూడు రోజుల్లో తాను పిఠాపురం మళ్లీ వస్తానని.. పడవలో వెళ్లి సముద్రంలో కాలుష్యాన్ని స్వయంగా పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే పొల్యూషన్ ఆడిట్ చేయమని ఆదేశాలు కూడా జారీ చేశారు.
అలాగే తీరప్రాంత రక్షణ గురించి మాట్లాడుతూ.. 323 కోట్లతో ఉప్పాడ తీర ప్రాంత గోడ నిర్మాణంకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఈ గోడ నిర్మాణానికి సంబంధించిన మీటింగ్ ఈ నెల 14 న కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. ఇక సమస్యల పరిష్కారానికి తనకు కొంత సమయం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ మత్స్యకారులను కోరారు. నాకు 100 రోజులు సమయం ఇవ్వండి, యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తానని తెలిపారు.
Prashant Kishor: 51 మందితో తొలి జాబితా విడుదల.. 16 శాతం ముస్లింలకు కేటాయింపు
మత్స్యకారులకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలి వెళ్ళిపోతానని ఉప ముఖ్యమంత్రి ఉద్వేగపూరితంగా మాట్లాడారు. అంతేకాకుండా.. న్యాయం చేస్తామని ఎగదోసి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకుల ట్రాప్లో పడకండి అని వారికి విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ పరిశ్రమలను వైసీపీ నేతలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. తాను ఇక్కడే ఉంటానని, ఎక్కడికి పారిపోనని స్పష్టం చేస్తూ.. మీరు తిడితే నేను పడతాను, నా భుజం మీద దెబ్బ కొడితే పడతాను అంటూ తన చిత్తశుద్ధిని తెలియజేశారు. మత్స్యకారులకు సంపూర్ణ న్యాయం చేస్తానని, వారి పక్షాన నిలబడతానని ఆయన హామీ ఇచ్చారు.
