ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్ ప్రాంతంలో 600 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న ఓ వ్యక్తిని అత్యవసర వైద్య చికిత్స కోసం క్రేన్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌లో తరలించడం అసాధ్యం కావడంతో, స్థానిక అధికారులు, ఫైర్ సిబ్బంది సాయంతో 273 కిలోలు ఉన్న ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Read Also:HIV Patient: ఎవడండీ బాబు వీడు.. మరీ ఇంత తేడాగా ఉన్నాడు.. ఆస్పత్రిలో అందరిపై హెచ్ఐవీ రక్తం
పూర్తి వివరాల్లోకి వెళితే.. బేరియాట్రిక్ రోగిని అత్యవసర చికిత్స కోసం.. ఓ క్రేన్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అతన్ని సాధారణంగా స్ట్రెచర్‌పై పడుకోబెట్టి అతని ప్లాట్ నుంచి కింది తీసుకోవరావడం అసాధ్యం. అధికారులు, ఫైర్ సిబ్బంది అంతా కలిసి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఆ భారీకాయుడిని బిల్డింగ్ నుంచి కిందికి దింపి ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తిని తరలించడానికి అగ్నిమాపక సిబ్బంది అపార్ట్మెంట్ గోడ బాల్కనీ రెయిలింగ్‌ల భాగాలను కట్ చేయాల్సి వచ్చింది. దాదాపు 12మంది అత్యవసర సిబ్బంది సహాయ చర్యలో పాల్గొన్నారు.
Read Also:Scooter on Fire Outside Showroom: ఏంటీ సుధా వీడు.. బైక్ పని చేయకపోతే తగలెట్టేస్తాడా…
ఆ వ్యక్తిని 20 అడుగుల ఎత్తుకు దించిన తర్వాత అత్యవసర చికిత్స కోసం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఇది ఒక పెద్ద ప్రయత్నం అయినప్పటికీ.. ప్రత్యేక వైద్య అవసరాలు ఉన్న రోగిని రవాణా చేయడానికి ఇంత తీవ్రమైన చర్య అవసరం కావడం ఇదే మొదటిసారి కాదు. స్పెయిన్, సౌదీ అరేబియాతో సహా ఇతర ప్రదేశాలలో ఇలాంటి క్రేన్ రెస్క్యూలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
View this post on Instagram
A post shared by Eddy Shipek (@eddyshipek)
