Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమా తర్వాత ఆయన రేంజ్ అమాంతం మారిపోయింది. గతం కంటే ఇప్పుడు ఆయన సినిమాలకు వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది. అయితే ఒకప్పుడు మాత్రం బన్నీ కొన్ని కథలను వేరే హీరోలు రిజెక్ట్ చేసినవి చేశాడు. అందులో కొన్ని హిట్ అయ్యాయి కూడా. ఇంకొన్ని సార్లు బన్నీ రిజెక్ట్ చేసిన కథలతో వేరే హీరోలు హిట్ అందుకున్నారు. అందులో ఓ బ్లాక్ బస్టర్ సినిమా కూడా ఉంది. అదేదో కాదు టెంపర్. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ కు బూస్ట్ ఇచ్చింది. ఈ మూవీ అప్పట్లో ఓ సంచలనంగా మారింది.
Read Also : Allu Arjun : బన్నీ చేసిన పనికి రూ.40 కోట్లు నష్టపోయిన అరవింద్..
అయితే ఈ కథను ముందుగా బన్నీకి వినిపించాడు పూరీ జగన్నాథ్. కానీ అప్పటికే చేతినిండా సినిమాలతో బన్నీ ఫుల్ బిజీగా ఉన్నాడు. తనకు కొంచెం టైమ్ పడుతుందని కుదిరితే వేరే వాళ్లతో చేయమని చెప్పాడంట అల్లు అర్జున్. దాంతో ఇదే కథను జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పగా వెంటనే ఒప్పేసుకున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు వేరియేషన్లు ఉన్న పాత్రలో ఇరగదీశాడు. అసలే నటనకు పెట్టింది పేరు అయిన ఎన్టీఆర్.. బలమైన పాత్రలో మెప్పించాడు. ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్ కు వరుసగా మూడు ప్లాపులు ఉన్నాయి. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుని మళ్లీ పామ్ లోకి వచ్చారు ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్. ఒకవేళ బన్నీ చేసి ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. కానీ బన్నీ రిజెక్ట్ చేస్తే ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ పడిందన్నమాట.
Read Also : Bigg Boss 9 : డిప్యూటీ సీఎం చొరవతో తెరుచుకున్న బిగ్ బాస్..
