కాంగ్రెస్ మాజీ ఎంపీ, కన్నడ నటి రమ్యకు అశ్లీల సందేశాలు పంపిన కేసులో కర్ణాటక పోలీసులు ఈరోజు 12 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. 380 పేజీల చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసి.. 12 మందిని నిందితులుగా చేర్చారు. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు 45వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు 380 పేజీల నివేదికను సమర్పించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా కన్నడ సూపర్‌స్టార్ దర్శన్, అతని స్నేహితురాలు పవిత్ర గౌడ ఉన్నారు. పవిత్ర గౌడ మొదటి నిందితురాలిగా ఉండగా.. దర్శన్ ఏ2గా ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరూ బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.
అభిమాని హత్య కేసులో కన్నడ సూపర్‌స్టార్ దర్శన్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలని నటి రమ్య సోషల్ మీడియాలో ప్ పోస్ట్ చేశారు. దీంతో దర్శన్ అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. కొందరు అసభ్య పదజాలంతో దూషణలకు దిగగా.. మరికొందరు అయితే అత్యాచారం చేస్తామంటూ బెదిరించారు. ఈ విషయంపై రమ్య జూలై 28న బెంగళూరు పోలీస్ కమిషనర్ సిమ్మంత్ కుమార్ సింగ్‌ను కలిశారు. పురుషులతో సమానంగా మహిళలకు స్వేచ్ఛ అవసరమని, సోషల్ మీడియాలో ఇలాంటి బెదిరింపులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 43 సోషల్ మీడియా ఖాతాలపై ఫిర్యాదు చేశారు. నమోదుచేసుకున్నా పోలీసులు దర్యాప్తు చేశారు.
Also Read: Rohit-Kohli: అన్ని ఊహాగానాలకు చెక్.. 2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ!
నటి రమ్య ఫిర్యాదు ఆధారంగా ఇప్పటివరకు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అందరూ హీరో దర్శన్ అభిమానులే అని విచారణలో తేలింది. పోలీసులు రమ్య స్టేట్‌మెంట్‌ను, అలాగే 12 మంది నిందితుల స్టేట్‌మెంట్‌లను ఛార్జ్‌షీట్‌లో జత చేశారు. ఛార్జ్‌షీట్‌లో అశ్లీల సందేశాలు, వాటికీ సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను సైతం చేర్చారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో ఆరుగురి కోసం పోలీసులు వెతుకుతున్నారు. మిగిలిన నిందితులను అరెస్టు చేసి.. వారిపై చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు అరెస్టు చేసిన 12 మందిలో నలుగురు ప్రస్తుతం జైలులో ఉన్నారు. మిగిలిన వారికి బెయిల్ లభించింది. కోర్టు త్వరలో కేసు విచారణ ప్రారంభించే అవకాశం ఉంది.
