వివాహాల్లోని కొన్ని తమాషా క్షణాలు వైరల్ గా మారుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ వివాహ వేడుకల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో దండ వేస్తుండగా.. ఎవరో పక్కన చిన్న తోక పటాక్ కాల్చారు.. దీంతో ఉన్నట్టుండి వరడు చాలా భయపడిపోయి పక్కకు ఒరిగాడే.. కానీ వధువు కొంచెం కూడా జంక కుండా అలాగే ఉండడం విశేషం. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా.. గొళ్లుమని నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది..
Read Also:Immigrants: 28 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్.. అక్రమంగా దేశంలోకి
పూర్తి వివరాల్లోకి వెళితే.. పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. పెళ్లి కొడుకు కత్తి తిప్పడాలు.. వరుడు వధువు కలిసి డ్యాన్స్ చేయడాలు వంటి వీడియోలు దర్శనమిస్తుంటాయి. వాటి కొన్ని ఫన్నీగా ఉండి త్వరగా వైరల్ అవుతుంటాయి. ఓ వివాహ వేడుకల్లో వరుడు హుందాగా, దర్జాగా కనిపించాడు. వధువు ముందు ఎంతో ధైర్యవంతుడిగా ఫోజు కొడుతుంటాడు. కానీ ఇక్కడ జరిగిన ఓ సంఘటనలో బాణా సంచా పేలిన శబ్ధానికి భయపడి కాస్త పక్కకు ఒరిగాడు. ఇది చూసిన బంధువులంతా.. అతడి పిరికి తనాన్ని చూసి తెగ నవ్వుకున్నారు.
Read Also:Florida Incident: ఇదేందయ్యా ఇది.. ఇది నేను సూడలే.. 273 కిలోలు ఉన్న క్రేన్ తో ఆస్పత్రికి…
వేదికపై వధూవరుల వరమాల కార్యక్రమ వేడుక బంధు మిత్రుల మధ్య అట్టాహాసంగా నిర్వహిస్తున్నారు. వరుడి మెడలో వధువు దండ వేసింది. ఆ తర్వాత వధువు మెడలో వరుడు దండ వేస్తుండగా వరుడి పక్కనే భారీ శబ్దంతో పటాక్ పేలింది. ఒక్కసారిగా భయపడిన వరుడు పక్కకు పడిపోయినంత పని చేశాడు. వెంటనే ఎవడ్రా ఇక్కడ పటాక్ కాల్చింది అంటూ అందరిపై అరిచారు. కాసేపటి తర్వాత యథావిధిగా ఆమె మెడలో దండ వేయించారు. ఇందులో విశేషం ఏమిటంటే.. వధువు మాత్రం కొంచెం కూడా భయపడకుండా అలానే నిల్చుంది.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది వీక్షించారు. వేల మందికి లైక్ చేశారు. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పాపం.. అతడిని ప్రశాంతంగా పెళ్లి చేసుకోనివ్వడయా అంటూ పోస్టులు పెడుతున్నారు.
View this post on Instagram
A post shared by Rani.jemti.dj (@golu_barwal_rani_jemti_dj08)
